Pallavi prashanth: రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ఈయన రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా టైటిల్ కూడా గెలుపొందారు.
ఇక తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తాను ఈ కార్యక్రమంలో విన్నర్ గా నిలబడితే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును మొత్తం పేద రైతులకు పంచుతానని ఈయన తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటానని ప్రతి రూపాయికి తాను లెక్క చెబుతానని ప్రశాంత్ తెలిపారు.
ఇలా ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పదేపదే చెప్పినటువంటి ప్రశాంత్ ఇచ్చిన మాట మర్చిపోయారని తాజాగా ఆయన వ్యవహారం చూస్తేనే అర్థమవుతుంది. డబ్బులు రైతులకు పంచుతానని చెప్పిన ప్రశాంత్ ఆ మాట మర్చిపోయారని ఇప్పటివరకు ఈయన రైతులకు డబ్బు పంచిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత రైతు బిడ్డ అనే ట్యాగ్ నుంచి సెలబ్రిటీ అనే ట్యాగ్ తగిలించుకున్నారు
పొలం పనులు చేయటం కష్టమే..
ఈయన ఇటీవల కాలంలో పొలం పనులు చేస్తూ కూడా కనిపించలేదు కానీ పెద్ద ఎత్తున పార్టీలు షోస్ అంటూ హైదరాబాద్లోనే సెలబ్రిటీ హోదాని అనుభవిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పలువురు ఈయన వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తూ ఒకసారి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన తర్వాత ఎండలో పొలం పనులు చేయడం కష్టమే అంటూ పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…