Categories: FeaturedMovie News

Vishwak sen: అలాంటి అవతారంలో కనిపించిన విశ్వక్.. డబ్బులను దానం చేసిన మహిళలు!

Vishwak sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. హిట్టు ఫ్లాప్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి ఈయన తనకు నచ్చిన సినిమాలన్నింటినీ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈయన గామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ పలు విషయాలను వెల్లడించారు.

తాజాగా ఈయన ఈ సినిమా షూటింగ్ సంఘటనలను గుర్తు చేసుకున్నారు. వారణాసిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బాగా చలిగా ఉందని తాను చలికి తట్టుకోలేక ఒక మూలన కూర్చోవడంతో ఒక మహిళ తనకు టిఫిన్ పెట్టి టీ ఇచ్చారు అంటూ ఈయన తెలియజేశారు.

ఇక వారణాసిలో కుంభమేళా సమయంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకున్నామని తెలిపారు. అయితే ఆ సన్నివేశాలలో తాను అఘోర పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. అయితే కుంభమేళా కావడంతో పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు చేరుకున్నారని అందులో కొంతమంది మహిళలు తనకు నేను నిజమైన అఘోర అనుకొని తనకు డబ్బులను దానం చేశారు అంటూ విశ్వక్ తెలిపారు.

నిజమైన అఘోర అనుకున్నారు…

ఇలా తాను అఘోర పాత్రలో కనిపించడంతో డబ్బులు ఇవ్వడంతో తాను షాక్ అయ్యానని విశ్వక్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా కోసం డైరెక్టర్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా స్పష్టంగా తీసుకురావడం కోసం డైరెక్టర్ చాలా కష్టపడినట్లు ఈ సందర్భంగా విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago