Tag Archives: night curfew

Night Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్..రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..!

Night Curfew: కరోనా తగ్గినట్లే తగ్గి.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్ కర్ఫ్యూని విధిస్తున్నాయి.

Night Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్..రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..!

దీనిలో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 10 నుంచి రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల నైట్ కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహాలుగా ఉంటే.. వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఉదయం వేళ 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Night Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్..రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ..!

స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పాలు, బ్యూటీ సెలూన్‌లు, జూలు, మ్యూజియంలు , ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసివేయబడతాయని పేర్కొన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్‌లు , షాపింగ్ మాల్స్ , మార్కెట్ కాంప్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఇంటి నుండి పనిని ఎంచుకోవాలని..

పార్కుల్లో సందర్శకుల సమాచారం కచ్చితంగా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో కొన్ని మినహాయింపులతో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఫిబ్రవరి 15 వరకు మూసివేయబడతాయని పేర్కొన్నారు. ఇక ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియం వంటి వాటిని నడిపించుకోవచ్చని తెలిపారు. డబుల్ డోస్ తీసుకున్న వారిని మాత్రమే వాటిల్లోకి అనుమతించనున్నట్లు చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న వారు మాత్రమే వారిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే అనుమతించనున్నారు. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 41,434 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 9,671 రికవరీలు, 13 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 173,228 ఉండగా.. ఓమిక్రాన్ సంఖ్య 1,009కి పెరిగింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు ఇంటి నుండి పనిని ఎంచుకోవాలని .. ఆఫీసులో పని చేసే అవసరం ఉంటేనే డ్యూటీకి వెళ్లాలని పేర్కొన్నారు.

Night Curfew: రాత్రి 11 గంటల తర్వాత అన్నీ బంద్..మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూ..!

Night Curfew: ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో వైపు సినిమా విడుదలు ఆగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలే మంచి పరిష్కారం అంటూ భావించిన ప్రభుత్వాలు ఈ దిశగా అడుగు వేస్తున్నాయి.

Night Curfew: రాత్రి 11 గంటల తర్వాత అన్నీ బంద్..మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూ..!

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధించగా.. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో భాగం అయిన యానాంలో కూడా నైట్ కర్ఫ్యూని విధించారు. దీనిని జనవరి 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ, హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌, యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉన్న‌ది.

Night Curfew: రాత్రి 11 గంటల తర్వాత అన్నీ బంద్..మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూ..!

ఇక యానాం విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అతి తక్కువ ఉష్ట్రోగ్రతలు నమోదు చేస్తున్నాయి. బయటకు వస్తే.. గడ్డకట్టి పోతామా అన్న రేంజ్ లో చలి చంపేస్తుంది. దీంతో పాటే అక్కడ పాజిటీవ్ కేసులు మొన్నటి వరు విపరీతంగా నమోదయ్యాయి. ప్రస్తుతం కాస్త ఆ కేసులు తగ్గు ముఖం పట్టినా.. మళ్లీ ఎక్కడ పెరుగుతాయోననే భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

గడిచని 24 గంటల్లో 15 కేసులు..

ప్రస్తుతం అక్కడ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC), ఒమిక్రాన్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో కూడా వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం.. సంబంధిత వారందరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని.. 31 జనవరి, 2022 (అర్ధరాత్రి) వరకు ఈ నైట్ క‌ర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. రాత్రి 11 గంట‌ల నుంచి తెల్ల‌వారుజాము 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. క‌రోనా, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సామాజిక, వినోద కార్యక్రమాలు అన్నీ నిషేధం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పుదుచ్చేరిలో గత 24 గంటల్లో 15 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,29,461 కు చేరుకుందని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

Night Curfew: పెరుగుతున్న కేసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..!

Night Curfew: ఓమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వేరియంట్ అత్యంత వేగంగా ప్రపంచంలోని వందకు పైగా దేశాల్లో విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోలం కలిగిస్తోంది. యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Night Curfew: పెరుగుతున్న కేసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..!

ఇప్పటికే యూకేలో ఓమిక్రాన్ తో 29 మరణాలు కూడా సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ తో ఇప్పటి వరకు 31 మంది మరణించారు. మరోవైపు ఇండియాలో కూడా ఓమిక్రాన్ కేసులు విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఇప్పటి వరకు 422 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం ప్రజల్ని కలవరపెడుతోంది.

Night Curfew: పెరుగుతున్న కేసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..!

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య సెంచరీని ధాటింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.  ఇక ఓమిక్రాన్ భయాలతో పలు రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఓడిశా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 


కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ…

తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటకలో 38 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు పబ్బుల్లో, రెస్టారెంట్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చాయి. మాస్కును తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది కర్ణాటక ప్రభుత్వం. మాస్కు లేకుండా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.