General News

Night Curfew: పెరుగుతున్న కేసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..!

Night Curfew: ఓమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వేరియంట్ అత్యంత వేగంగా ప్రపంచంలోని వందకు పైగా దేశాల్లో విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోలం కలిగిస్తోంది. యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Night Curfew: పెరుగుతున్న కేసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..!

ఇప్పటికే యూకేలో ఓమిక్రాన్ తో 29 మరణాలు కూడా సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ తో ఇప్పటి వరకు 31 మంది మరణించారు. మరోవైపు ఇండియాలో కూడా ఓమిక్రాన్ కేసులు విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఇప్పటి వరకు 422 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం ప్రజల్ని కలవరపెడుతోంది.

Night Curfew: పెరుగుతున్న కేసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..!

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య సెంచరీని ధాటింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.  ఇక ఓమిక్రాన్ భయాలతో పలు రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఓడిశా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 


కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ…

తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటకలో 38 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు పబ్బుల్లో, రెస్టారెంట్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చాయి. మాస్కును తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది కర్ణాటక ప్రభుత్వం. మాస్కు లేకుండా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago