RamCharan: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫుల్ బిజీ అయిపోయాడు చిత్ర సభ్యులు. దీనితో రామ్ చరణ్ కూడా ఫుల్ బిజీ అయ్యాడు. వచ్చే నెల జనవరి7, 2022 ప్రపంచ వ్యాప్తగా విడుదల కానుంది. ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండగా.. మరో ఐదు భాష్లల్లో ఈ సినిమా డబ్ చేయబడింది.
ఇక రామ్ చరన్ ఆర్ఆర్ఆర్ తర్వాత పలు ప్రాజెక్ట్ ల్లో నటించనున్నాడు. శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనుండగా దీనిలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీని తర్వాత మరో రెండు సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. ఇక చరణ్ సినిమాలు రాబోయే అన్నింటిని.. RRR లాగానే ప్యాన్ ఇండియా లెవల్లో ఉండనున్నాయి.
రామ్ చరణ్ త్వరలో శంకర్ చిత్రాన్ని ముగించిన తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కలిసి ప్రాజెక్ట్ ఆర్సీ16 కోసం పని చేయనున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రం అని దర్శకుడు ఇటీవల వెల్లడించాడు. ఇక రామ్ చరణ్, గౌతమ్ వారి వారి చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నందున మేకర్స్ ఇంకా మిగిలిన నటీనటులు.. సిబ్బంది గురించి వెల్లడించలేదు. త్వరలోనే వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఇదిలా ఉండగా.. RC16 లో రామ్ చరణ్ కు జోడీగా.. బాలీవుడ్ భామ.. దిశా పఠానీను సెలెక్ట్ చేసినట్లు టాక్ వినపడుతోంది. ఈమె వరణ్ తేజ్ తో లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో జతకట్టనున్నట్లు సమాచారం. ఇక మరో విషయం ఏంటంటే.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే శంకర్ ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడని.. ఇది పూర్తవ్వాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ లోపు రామ్ చరణ్ జెర్సీ దర్శకుడితో సినిమాను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…