General News

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

Sad News: ఓ బాలింత ఆసుపత్రి బాత్రూంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ గర్భవతి.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

ఆమెకు 30 ఏళ్లు ఉంటాయి. ఆమె గర్భవతి అయి 9 నెలలు కావడంతో ఈ నెల 12 న నొప్పులతో ఇబ్బంది పడుతుండగా.. స్థానిక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు మొదటి కాన్పు కావడం.. అంతే కాకుండా వాళ్లు పేదవారు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాల్సి వచ్చింది.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

ఆమెకు సీజేరియన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు వేశారు. అయితే ఏడు రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్ కావాల్సి ఉంది. కానీ ఆమెకు కుట్లు మానకపోవడంతో మరోసారి.. ఆపరేషన్ చేసి.. కుట్లు వేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి:

అయితే మరోసారి ఆమెకు ఇలా సర్జరీ చేసి కుట్లు వేశారు. ఇక ఆమె ఈ నొప్పులకు భరించలేక.. అవి ఇంకా మానకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలా మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆమె బంధువులు.. మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆందోళనకు దిగారు. పుట్టిన మగశిశువు తల్లిలేని అనాథగా మారిందని.. ఉమా భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago