VJ Sunny: వీజే సన్నీని ఓ రేంజ్ లో ఏకిపారేసిన మాధవిలత..కారణం ఏంటంటే?
VJ Sunny: తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయని తారలలో మాధవి లత ఒకరు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇలా రాసుకొచ్చింది. బిగ్ బాస్ తెలుగు 5 విజేత.. వీజే సన్నీ తనకు చాలా మద్దతు ఇచ్చిన ఫ్యాన్ పేజీలను .. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లను విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు, టీవీ ఛానెల్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లకు వీజే సన్నీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆమె ఆరోపించింది. బిగ్ బాస్ హౌస్‌లో సన్నీ ఆటకు తాను చాలా సపోర్ట్ చేశానని మాధవీలత తెలిపింది. ఎవరైనా తప్పు చేస్తే విమర్శించడానికి అయినా.. ఆ తప్పును ఎత్తిచూపడానికి తాను వెనుకాడను అంటూ స్పష్టం చేసింది.
ఇతరులకు కృతజ్ఞతాభావం చూపని వారిని తాను ఇష్టపడనని చెప్పింది. ఇక ఆమె పోస్టు చేసిన దానిలో ఏముందంటే.. సన్నీ కోసం ఎంత మంది పీఆర్ లా మారిపోయారు.. అందరికీ థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే ఐపోదా సన్నీ అంటూ విమర్శించారు. సన్నీని గొప్పగా ప్రొజెక్ట్ చేసే ఎంత మంది యూట్యూబ్ రివ్యూవర్ ఉన్నారు.. కనీసం వాళ్ల నేమ్స్ మెన్షన్ చేశాడా.. అతడి కంటే తెలియదు.. కనీసం సన్నీ స్నేహితులకు అయినా తెలీదా.. కళ్లు నెత్తిన ఎక్కాయా..? ఫస్ట్ ప్రయారిటీ ఎవిడికి ఇవ్వాలి..? మీడియా నుంచి వచ్చా కాబట్టి మీడియాకే ప్రాధాన్యతనిస్తాననే సన్నీ బిస్కెట్ బాగానే ఉందని ఆమె స్టోరీలో రాసుకొచ్చింది.
సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో.. ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేసిన ఒక్కరికీ సన్నీ నుంచి ఎటువంటి మెసేజ్, ఫోన్ రాలేదు. పాపం.. వాళ్లంతా సన్నీ ఏడిస్తే ఏడ్చారు, సన్నీ నవ్వితే నవ్వారు. వారం రోజులవుతున్నా ఇంకా టాప్ ఛానల్స్‌తోనే బిజీ ఉండటం తప్పు, నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా’ అని వార్నింగ్ ఇచ్చింది మాధవీలత. ఇక దీనిపై సన్నీ ఇంత వరకు స్పందిచలేదు. అతడు ఎలా తీసుకుంటాడో చూద్దాం
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…