Featured

VJ Sunny : వారిద్దరి రిలేషన్ పై వీజే సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పాపం దీప్తి, శ్రీహాన్ అంటూ..!

VJ Sunny : బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. ప్రస్తుతం బిగ్ బాస్ 6 కోసం చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ 5లో వీజే సన్నీ విజయం సాధించారు. చివరిదాకా పోటీలో ఉన్న షణ్ముఖ్ మాత్రం రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్ ముగిసినా.. ఓ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ముఖ్యంగా సిరి, షన్నూ మధ్య రొమాన్స్ పై నెటిజెన్లు ఇప్పటికీ స్పందిస్తూనే ఉన్నారు.

VJ Sunny : వారిద్దరి రిలేషన్ పై వీజే సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పాపం దీప్తి, శ్రీహాన్ అంటూ..!

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న షణ్ముక్ కేవలం సిరి కారణంగానే ఓడిపోయాడని  బిగ్ బాస్ ఆడియన్స్ అనుకుంటున్నాడు. ఈవిషయాన్ని షణ్ముఖ్ కూడా వెల్లడించారు. అయితే మా మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ అని ఇద్దరు చెబుతున్నప్పటికీ.. సిరి, షణ్ముఖ్ మధ్య కిస్సింగులు హగ్గింగులు జనాలకు వేరే అనుమానాలు తెప్పించాయి. ఫ్రెండ్ షిఫ్ ఉంటే ఇంతలా చేయాలా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Bigg Boss Season 5 Winner: వారిద్దరి రిలేషన్ పై వీజే సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పాపం దీప్తి, శ్రీహాన్ అంటూ..!

బిగ్ బాస్ షోకు వచ్చిన సిరి తల్లి కూడా ఈ మ్యాటర్ పై సీరియస్ అయింది. సిరి.. షణ్ముఖ్ తో హద్దులు దాటుతుందని కుండబద్దలు కొట్టేలా మాట్లాడింది. బిగ్ బాస్ కు వెళ్లక ముందు షణ్ముఖ్.. దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. సిరి కూడా శ్రీహాన్ తో ప్రేమలో ఉంది. అయితే బిగ్ బాస్ వల్ల వీరద్దరు రిలేషన్స్ తెగిపోయాయనే వాదనలు వస్తున్నాయి. 

చాలా సార్లు వారిద్దరికి చెబుదాం అనుకున్నా..సన్నీ:

తాజాగా సిరి- షణ్ముఖ్ వ్యవహారంపై బిగ్ బాస్ విన్నర్ సన్నీ స్పందించారు. చాలా సార్లు వారిద్దరికి ఈ విషయం గురించి చెబుదాం అనిపించింది. సిరితో ఓ మాట చెప్పాలని అనుకున్నానని వెల్లడించాడు సన్నీ. దోస్తాన్ దోస్తానే.. కానీ బయట నిన్ను నమ్ముకుని ఒకరు( శ్రీహాన్) ఉన్నాడని చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. అయితే చాలా సార్లు ఈవిషయం వారిద్దరికీ చెబుదాం అనుకున్నానని.. అయితే వారిద్దరు తీసుకునే పరిస్థితిలో లేరని అనిపించిందని సన్నీ అన్నాడు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడాలని ప్రయత్నించినా.. మాకు కొంచెం సమయం కావాలి.. ఇప్పుడు మాట్లాడుకోవాలని అనుకోవట్లేదని అన్నప్పుడు ఇంకేం మాట్లాడుతాం అన్నారు సన్నీ.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago