Night Curfew: రాత్రి 11 గంటల తర్వాత అన్నీ బంద్..మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూ..!
Night Curfew: ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో వైపు సినిమా విడుదలు ఆగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలే మంచి పరిష్కారం అంటూ భావించిన ప్రభుత్వాలు ఈ దిశగా అడుగు వేస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధించగా.. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో భాగం అయిన యానాంలో కూడా నైట్ కర్ఫ్యూని విధించారు. దీనిని జనవరి 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది.
ఇక యానాం విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అతి తక్కువ ఉష్ట్రోగ్రతలు నమోదు చేస్తున్నాయి. బయటకు వస్తే.. గడ్డకట్టి పోతామా అన్న రేంజ్ లో చలి చంపేస్తుంది. దీంతో పాటే అక్కడ పాజిటీవ్ కేసులు మొన్నటి వరు విపరీతంగా నమోదయ్యాయి. ప్రస్తుతం కాస్త ఆ కేసులు తగ్గు ముఖం పట్టినా.. మళ్లీ ఎక్కడ పెరుగుతాయోననే భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
ప్రస్తుతం అక్కడ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC), ఒమిక్రాన్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో కూడా వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం.. సంబంధిత వారందరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని.. 31 జనవరి, 2022 (అర్ధరాత్రి) వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సామాజిక, వినోద కార్యక్రమాలు అన్నీ నిషేధం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పుదుచ్చేరిలో గత 24 గంటల్లో 15 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,29,461 కు చేరుకుందని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…