Featured

Megastar Chiranjeevi: సీని కార్మికులపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..అలా నేను ఉండనంటూ షాకింగ్ కామెంట్స్..!

Megastar Chiranjeevi: కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది సినీ కార్మికులు ఇబ్బందులకు గురయ్యారని.. వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలనే కోరిక తనకు ఉందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతీ ఒక్కరికీ.. అన్ని వర్గాల వారికీ యోధా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌లో పరీక్షలు, అవసరమైన చికిత్స కోసం 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Megastar Chiranjeevi: సీని కార్మికులపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..అలా నేను ఉండనంటూ షాకింగ్ కామెంట్స్..!

తన కోరికను అంగీకరించి.. వెంటనే ఒప్పుకున్న యోధా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం సంతోషం అన్నారు. ఇక నుంచి ఆసుపత్రికి సంబంధించి చికిత్స, పరీక్షలకు 50 శాతం రాయితీపై ఇవి పనిచేస్తాయన్నారు.

Megastar Chiranjeevi: సీని కార్మికులపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..అలా నేను ఉండనంటూ షాకింగ్ కామెంట్స్..!

సినీ పరిశ్రమకు పెద్దన్నగా చిరంజీవి కావాలని ప్రతీ ఒక్కరూ అంటున్నారని.. కానీ తాను పెద్దన్నగా ఉండటం ఇష్టం లేదని.. కానీ అండగా.. అంటానని అన్నారు. అవసరమైనప్పుడు మీతోడుగా మాత్రం ఉంటానన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్టుగా నిలుస్తానన్నాడు.

మనస్సులో మాట బయట పెట్టిన మెగస్టార్..

ఇలా తన మనస్సులో మాటను స్పష్టం చేశాడు మెగస్టార్ చిరంజీవి. అండగా ఉండే పదవి తనదేనని.. పంచాయతీ చేసే ఉద్దేశ్యం తనకు లేదని అన్నాడు. సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం తనకు ఇష్టం లేదని.. కానీ సినీ కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుంటానని.. వారి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటానని వెల్లడించారు. దాసరి నారాయణరావు మరణం తర్వాత సినీ పరిశ్రమకు పెద్దన్నగా ఎవరూ లేరని.. కానీ ఆ ప్లేస్ ను రిప్లేస్ చేసే హక్కు మీకే ఉందని.. ఆ బాధ్యతలు స్వీకరించాలని చిరంజీవిని కోరగా..అతడు ఇలా సున్నితంగా బదులు ఇచ్చాడు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం పెద్దన్నగా ఉంటానన్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

8 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago