Megastar Chiranjeevi: కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది సినీ కార్మికులు ఇబ్బందులకు గురయ్యారని.. వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలనే కోరిక తనకు ఉందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతీ ఒక్కరికీ.. అన్ని వర్గాల వారికీ యోధా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌లో పరీక్షలు, అవసరమైన చికిత్స కోసం 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

తన కోరికను అంగీకరించి.. వెంటనే ఒప్పుకున్న యోధా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం సంతోషం అన్నారు. ఇక నుంచి ఆసుపత్రికి సంబంధించి చికిత్స, పరీక్షలకు 50 శాతం రాయితీపై ఇవి పనిచేస్తాయన్నారు.

సినీ పరిశ్రమకు పెద్దన్నగా చిరంజీవి కావాలని ప్రతీ ఒక్కరూ అంటున్నారని.. కానీ తాను పెద్దన్నగా ఉండటం ఇష్టం లేదని.. కానీ అండగా.. అంటానని అన్నారు. అవసరమైనప్పుడు మీతోడుగా మాత్రం ఉంటానన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్టుగా నిలుస్తానన్నాడు.
మనస్సులో మాట బయట పెట్టిన మెగస్టార్..
ఇలా తన మనస్సులో మాటను స్పష్టం చేశాడు మెగస్టార్ చిరంజీవి. అండగా ఉండే పదవి తనదేనని.. పంచాయతీ చేసే ఉద్దేశ్యం తనకు లేదని అన్నాడు. సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం తనకు ఇష్టం లేదని.. కానీ సినీ కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుంటానని.. వారి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటానని వెల్లడించారు. దాసరి నారాయణరావు మరణం తర్వాత సినీ పరిశ్రమకు పెద్దన్నగా ఎవరూ లేరని.. కానీ ఆ ప్లేస్ ను రిప్లేస్ చేసే హక్కు మీకే ఉందని.. ఆ బాధ్యతలు స్వీకరించాలని చిరంజీవిని కోరగా..అతడు ఇలా సున్నితంగా బదులు ఇచ్చాడు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం పెద్దన్నగా ఉంటానన్నాడు.































