Tag Archives: no background

Director Teja: సినీ బ్యాగ్రౌండ్ లేని వారికి నేనున్నాను.. వారికి నేను బ్రేక్ ఇస్తా.. తేజ కామెంట్స్ వైరల్!

Director Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో తేజ ఒకరు. ముక్కు సూటిగా నిర్మొహమాటంగా తనకు తోచినది చెబుతూ ఈయన వార్తలు నీలుస్తుంటారు. అయితే తాజాగా ఈయన దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు విషయాలను తెలియజేశారు. తాను ఫుట్ పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.అయితే చాలామంది కూడా ఇండస్ట్రీలోకి రావాలన్న ఆశతో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఎలా రావాలో తెలియక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించే వారికి అండగా నేనుంటానని తెలిపారు. తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నంతవరకు కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉంటానని తెలియజేశారు. తాను స్టార్ హీరోలతో సినిమా చేసిన అందులో కొత్త వారికి కూడా అవకాశాలు కల్పిస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

Director Teja: కొత్త వారిని పరిచయం చేస్తూనే ఉంటా….


ఇలా ఇండస్ట్రీలో కొనసాగాలన్న ఉత్సాహం టాలెంట్ కలిగి ఉన్నటువంటి వారందరిని తాను ఎంకరేజ్ చేస్తూ వారికి మంచి బ్రేక్ ఇస్తానని తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన ఇప్పటివరకు ఎంతోమంది హీరో హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తేజ లాంచ్ చేసిన వారందరూ కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.