Director Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో తేజ ఒకరు. ముక్కు సూటిగా నిర్మొహమాటంగా తనకు తోచినది చెబుతూ ఈయన వార్తలు నీలుస్తుంటారు. అయితే తాజాగా ఈయన దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు విషయాలను తెలియజేశారు. తాను ఫుట్ పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.అయితే చాలామంది కూడా ఇండస్ట్రీలోకి రావాలన్న ఆశతో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఎలా రావాలో తెలియక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించే వారికి అండగా నేనుంటానని తెలిపారు. తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నంతవరకు కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉంటానని తెలియజేశారు. తాను స్టార్ హీరోలతో సినిమా చేసిన అందులో కొత్త వారికి కూడా అవకాశాలు కల్పిస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగాలన్న ఉత్సాహం టాలెంట్ కలిగి ఉన్నటువంటి వారందరిని తాను ఎంకరేజ్ చేస్తూ వారికి మంచి బ్రేక్ ఇస్తానని తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన ఇప్పటివరకు ఎంతోమంది హీరో హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తేజ లాంచ్ చేసిన వారందరూ కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…