Tag Archives: non vegetarians

గుడ్డు శాఖాహారమా.. మాంసాహారమా..? శాస్త్రవేత్తలు తేల్చేశారు..!

కొన్ని ప్రశ్నలకు మనం ఎంత వెతికినా సమాధానం దొరకదు. ఉదాహరణకు చెట్టు ముందా విత్తనం ముందా..? కోడి ముందా గుడ్డు ముందా..? లాంటి ప్రశ్నలు తికమక పెట్టడానికి తప్ప సమాధానం చెప్పడానికి మాత్రం వీలు పడదు.

అయితే చాలా కాలంగా గుడ్డు శాఖాహారమా మాంసాహారమా..? అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే ఈ ప్రశ్నకు ఇటీవల శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చేశారు. మొదట చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే.. కోడి మాంసాహారం కాబట్టి కోడి నుండి వచ్చిన గుడ్డు కూడా మాంసాహారమే అంటూ గుడ్డుని తినడానికి ఇష్టపడరు. దీనికి చిన్న లాజిక్ఏంటంటే.. పశువు అనేది మాంసాహారి.

మరి ఆ పశువుల నుంచి వచ్చే పాలు కూడా మాంసాహారమే అవ్వాలి.. కానీ శాఖాహారంగా ఎందుకు పరిగణిస్తున్నారని చాలామందికి వచ్చే అనుమానం. అయితే గుడ్డుపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి గుడ్డు అనేది శాఖాహారంగా తేల్చేశారు. ఇక గుడ్డు వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉడక బెట్టిన గుడ్డు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. ఇక గుడ్డును అనేక రకాలుగా వండుకుని తినొచ్చు. ఒక కోడి మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి పుట్టిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్‌ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. సాధారణంగా మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. కాబట్టి గుడ్డు గురించి ఏం ఆలోచన లేకుండా లాగించేయవచ్చ అంటారు శాస్త్రవేత్తలు.

మీరు నాన్ వెజ్ ప్రియులా… అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు..చెప్పండి. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలా నాన్ వెజ్ రోజు ఇష్టపడి తినే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అమెరికా వైద్యులు తెలియజేస్తున్నారు.మాంసం ఎక్కువగా తినే వారిలో వివిధ రకాల అలర్జీ సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు.

అమెరికాలో ఈ విధంగా మాంసం తిని అలర్జీ బారిన పడినవారు ఎక్కువగా వైద్యులను సంప్రదిస్తున్నారు అని అయితే మాంసం తినడం వల్ల అలర్జీలు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం తెలియడం లేదని వైద్యులు వెల్లడించారు.తమ వద్దకు అలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు అంతకుముందు రోజు మాంసం తిన్నట్లు చెప్పడం డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే ఈ విషయంలో నిజం లేదని కొట్టిపారేసిన డాక్టర్లు అల్ఫాగల్ అనే అలర్జీ రోగిపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా అతని శరీరంలో ఒక చిన్న కణంలో యాంటీబాడీ కనుగొనడం జరిగింది. అల్ఫాగల్‌కు ప్రతిరోధకాలలో అలర్జీ లక్షణాలు కనిపించడంతో వైద్యులు మాంసం తినడం వల్లే ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు.

ఏదిఏమైనప్పటికీ మాంసం తినడం వల్ల అలర్జీ సమస్యలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే వైద్యులు మాంసం తినేవారు పలు జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. మాంసం తినే వారు దానిని బాగా ఉడికించే తినడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చని వైద్యులు తెలియజేశారు.