Tag Archives: notification

Cognizant: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ! కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Cognizant: రెండేళ్ల క్రితం మొదలైన కరోనా మహమ్మారి… ప్రపంచ దేశాలను ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. వరస లాక్ డౌన్లు, కరోనా వేవ్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. దీంతో పలు రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది.

Cognizant: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ! కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

దీంతో చాలా రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇటీవల ఇండియా ఎకనామిక్ సర్వేలో కూడా ఒక్క వ్యవసాయ రంగంం తప్పితే.. మిగతా రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడిందని తెలిపింది. ఇదిలా ఉంటే కొత్త ఉద్యోగాలు కూడా రాలేదు.

Cognizant: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ! కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఆశించి స్థాయిలో లాభాలు రాకపోవడంతో పలు ఐటీ కంపెనీలు రిక్రూట్ మెంట్ కు దూరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రెషర్స్ ని రిక్రూట్ చేసుకునేందుకు సన్నద్ధం అవుతున్నాయి. 

2021లో కాగ్నిజెంట్ సుమారు రూ. 1.39 లక్షల కోట్ల ..

తాజాగా ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ 2022లో ఏకంగా 50 వేల మంది ప్రెషర్స్ ని తీసుకోనుంది. కాగ్నిజెంట్ చరిత్రలోనే ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యగులను రిక్రూట్ చేసుకోవడం తొలిసారి. గతేడాది ఇదే సంస్థ 33 వేల మంది ప్రెషర్లను తీసుకుంది. దీంతో 2021 అక్టోబర్ నాటికి కాగ్నిజెంట్ లో ఉద్యోగుల సంఖ్య మొత్తం 3,30,600కు చేరింది. ఇదిలా ఉంటే 2021లో కాగ్నిజెంట్ సుమారు రూ. 1.39 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. 2020తో పోలిస్తే ఇది రెండు అంకెల వృద్ధి రేటు కావడం విశేషం. ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 10.2 శాతం నుంచి 11.2 శాతానికి ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది.

సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్..?

సింగరేణి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 372 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. లోకల్ అభ్యర్థులతో పాటు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బొగ్గు సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న సింగరేణి సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను అప్ లోడ్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం ఫిబ్రవరి 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

మొత్తం ఉద్యోగాలలో ఫిట్టర్ 105 ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రిషియన్ 51 ఉద్యోగ ఖాళీలు, వెల్డర్ 54 ఉద్యోగ ఖాళీలు, టర్నర్‌ లేదా మెషినిస్ట్‌ ట్రైనీ 22 ఉద్యోగ ఖాళీలు, మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ 14 ఉద్యోగ ఖాళీలు, మౌల్డర్‌ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 19, జూనియర్‌ స్టాఫ్‌ నర్స్ ఉద్యోగ ఖాళీలు 84 ఉన్నాయి. జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లోకల్ ఉద్యోగ ఖాళీలతో పోల్చి చూస్తే జనరల్ ఉద్యోగ ఖాళీలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. .

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6,506 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాలలో గ్రూప్-బి గెజిటెడ్ పోస్టులు 250 ఉండగా గ్రూప్-బి నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు 3,513 గ్రూప్-సి ఉద్యోగాలు 2,743 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వయస్సు లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. సీబీఐ, రైల్వే, పోస్టల్, ఇన్ కమ్ టాక్స్, ఇంటలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ సెక్రటేరియట్ ఇతర ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 31 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ నోటిఫికేషన్ విడుదల…?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాలు మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చింది. తాజాగా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అటవీ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుంది.

రాష్ట్ర అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో అటవీ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 శాతం సిబ్బంది కొరత ఉండగా ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉండగా అడవుల విస్తీర్ణం మరింత పెంచే దిశగా అటవీశాఖ అడుగులు వేస్తోంది.

జాతీయ అటవీ విధానం ప్రకాతం అటవీ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉండగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. అటవీశాఖ ప్రస్తుతం 540 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం మరో 1,000 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఏపీపీఎస్సీ 1000 ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. కరోనా వైరస్ విజృంభణ తగ్గిన నేపథ్యంలో వరుసగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.