Tag Archives: olive oil

కనుబొమ్మలు అందంగా కనిపించాలా అయితే .. ఈ చిట్కాలను పాటించండి..

మహిళ అందాన్ని ఎక్కువగా కనుబొమ్మలు పెంచుతాయి. అవి ఒత్తుగా ఉంటే చూసే వారికి మంచిగా అనిపిస్తుంటుంది. తీరైన, ఒత్తైన కనుబొమ్మలు ముఖానికి అందాన్ని తీసుకొస్తాయి. చాలా వరకూ అందరికీ అలా దృఢమైన కనుబొమ్మలు ఉండవు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలు పొందొచ్చు.

కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి.. కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు లేదా మూడుసార్లు పెట్రోలియం జెల్లీ(వాజిలైన్)‌ని అప్లై చేయాలి. అయితే, కేవలం రాసి అలా ఉంచకుండా కాస్తా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఐబ్రోస్ రక్తప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. ఇదే కాకుండా కనుబొమ్మలు పెరగడానికి ఆముదం రాయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.

ఆముదంలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండటం వల్ల మీ ఐబ్రోస్ ఒత్తుగా, స్ట్రాంగ్ గా పెరుగుతాయి. విటమిన్ ఇ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, సి ఉంటాయి. కనుబొమ్మల పైన ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల, కొన్ని వారాల తర్వాత ఆశించిన ఫలితం కనబడుతుంది.

కాబట్టి రోజూ రాత్రి ఈ ఆయిల్‌ని అప్లై చేసి కాస్తా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అవి ఒత్తుగా పెరగాలంటే.. మెంతుపిండి, ఆల్మడ్ ఆయిల్, ఉల్లి రసం మరియు కలబంద జెల్ కూడా అప్లై చేయవచ్చు. కానీ ఏది పూసిన కళ్లను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.