మహిళ అందాన్ని ఎక్కువగా కనుబొమ్మలు పెంచుతాయి. అవి ఒత్తుగా ఉంటే చూసే వారికి మంచిగా అనిపిస్తుంటుంది. తీరైన, ఒత్తైన కనుబొమ్మలు ముఖానికి అందాన్ని తీసుకొస్తాయి. చాలా వరకూ అందరికీ అలా దృఢమైన కనుబొమ్మలు ఉండవు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలు పొందొచ్చు.
కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి.. కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు లేదా మూడుసార్లు పెట్రోలియం జెల్లీ(వాజిలైన్)ని అప్లై చేయాలి. అయితే, కేవలం రాసి అలా ఉంచకుండా కాస్తా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఐబ్రోస్ రక్తప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. ఇదే కాకుండా కనుబొమ్మలు పెరగడానికి ఆముదం రాయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.
ఆముదంలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండటం వల్ల మీ ఐబ్రోస్ ఒత్తుగా, స్ట్రాంగ్ గా పెరుగుతాయి. విటమిన్ ఇ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, సి ఉంటాయి. కనుబొమ్మల పైన ఆలివ్ ఆయిల్ ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల, కొన్ని వారాల తర్వాత ఆశించిన ఫలితం కనబడుతుంది.
కాబట్టి రోజూ రాత్రి ఈ ఆయిల్‌ని అప్లై చేసి కాస్తా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అవి ఒత్తుగా పెరగాలంటే.. మెంతుపిండి, ఆల్మడ్ ఆయిల్, ఉల్లి రసం మరియు కలబంద జెల్ కూడా అప్లై చేయవచ్చు. కానీ ఏది పూసిన కళ్లను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…