కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఎన్నో ట్వీస్ట్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్‌కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్.. లీడ్ పాత్రల మధ్య గొడవలు పెట్టించి సాగదీస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎపిసోడ్ ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిగా మారింది.
దర్శకుడు కనిపిస్తే కొట్టేయాలన్న కోపంతో ఉన్నారు నెటిజన్లు. కోర్టులో జరిగిన సీన్ చూస్తే అలానే అనిపిస్తుంది. మోనిత చినిపోయినట్లు .. కార్తీక్ జైలుకు వెళ్లడం.. కట్ చేస్తే.. మొత్తం ఫేక్ అని తెలిసి.. పోలీస్ ఆఫీసర్ రోషిని బలి చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం లాజిక్ మిస్ అవుతుందని.. అర్థం పర్థం లేకుండా డైరెక్టర్ కథను నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంత పెద్ద పోలీసు ఆఫీసర్ రోషిని సీసీ కెమెరాలు చెక్ చేయాలన్న ఆలోచన లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కార్తీక దీపం వల్ల రాత్రి ఇంటికి వెళ్తే తమకు అన్నం పెట్టడం లేదంటూ.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. లాజిక్ లేకుండా.. ఆసుపత్రిలో మోనిత పేషెంట్ కు నర్సు లేకుండా ఎలా చెక్ చేస్తుంది అంటూ.. మండిపడ్డాడు మరో నెటిజన్.
ఈ సీరియల్ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఉందంటూ కామెంట్ చేశారు. సీరియల్ ను పొడిగించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు తప్ప.. ఏ మాత్రం సీరియల్ లో పసలేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత చేసినా.. ఎన్ని నెగెటివ్ కామెంట్లు పెట్టినా.. ఆ సీరియల్ కు వచ్చే రేటింగ్ వస్తూనే ఉంటుంది. నెగెటివ్ గా ఉండే వాళ్లు కూడా ఉంటూనే ఉంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…