Tag Archives: Oscar Award Nominations 2023

Oscar Award Nominations2023: ఆస్కార్ అవార్డు నామినేషన్ లో నాటు నాటు సాంగ్… సంతోషంలో చిత్ర బృందం!

Oscar Award Nominations2023: చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను అందిస్తూ ఉంటారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తుంటారు. ఇక ఏడాది ఆస్కార్ అవార్డు నామినేషన్ లో భాగంగా తెలుగు సినిమా నామినేషన్స్ లోకి వెళ్లడం తెలుగు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణం.

దాదాపు 22 సంవత్సరాలు తర్వాత ఆస్కార్ నామినేషన్ లో భారతీయ చిత్రానికి అవకాశం దక్కింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరి భాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది. ఇలా ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో చిత్ర బృందంతో పాటు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఆస్కార్ నామినేషన్ లో భాగంగా నాటు నాటు సాంగ్ నిలవడంతో చిత్ర బృందం ఈ విషయంపై స్పందిస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టించాం అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం విశేషం ఇలా గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న వారు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.

Oscar Award Nominations2023: మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం…

ఏడాది జరగబోతున్న 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ఇక ఈ అవార్డులను మార్చి 13వ తేదీ ప్రకటించనున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు ఆస్కార్ నామినేషన్ లో చోటు సంపాదించుకున్నాయి. మొత్తానికి ఆస్కార్ నామినేషన్ లో భాగంగా మూడు భారతీయ సినిమాలు నామినేట్ కావడం విశేషం.