Oscar Award Nominations2023: చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను అందిస్తూ ఉంటారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తుంటారు. ఇక ఏడాది ఆస్కార్ అవార్డు నామినేషన్ లో భాగంగా తెలుగు సినిమా నామినేషన్స్ లోకి వెళ్లడం తెలుగు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణం.
దాదాపు 22 సంవత్సరాలు తర్వాత ఆస్కార్ నామినేషన్ లో భారతీయ చిత్రానికి అవకాశం దక్కింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరి భాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది. ఇలా ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో చిత్ర బృందంతో పాటు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఆస్కార్ నామినేషన్ లో భాగంగా నాటు నాటు సాంగ్ నిలవడంతో చిత్ర బృందం ఈ విషయంపై స్పందిస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టించాం అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం విశేషం ఇలా గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న వారు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.
ఏడాది జరగబోతున్న 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. ఇక ఈ అవార్డులను మార్చి 13వ తేదీ ప్రకటించనున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు ఆస్కార్ నామినేషన్ లో చోటు సంపాదించుకున్నాయి. మొత్తానికి ఆస్కార్ నామినేషన్ లో భాగంగా మూడు భారతీయ సినిమాలు నామినేట్ కావడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…