Sudheer Varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నిస్తున్న సుధీర్ వర్మ ఉన్నఫలంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుధీర్ వర్మ కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్ వంటి సినిమాల ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన వైజాగ్ లోనే తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈయన ఆత్మహత్య చేసుకున్న అనంతరం ప్రాథమిక చికిత్స కోసం ఈయనని నగరంలోని ఎల్జి హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం హాస్పిటల్ సిబ్బంది ఈయన డేత్ రిపోర్ట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు తన రిపోర్టులో సంచలన విషయాలను తెలియచేశారు. సుదీర్ వర్మ విషం తాగి మరణించారని డాక్టర్స్ తెలియచేశారు.ఇలా ఈయన విషం తాగి మరణించారనే వార్త తెలియడంతో పోలీసులు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై సుదీర్ వర్మ కుటుంబ సభ్యుల స్పందించి సుధీర్ వర్మ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలను అధిగమించలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా లేక ఏవైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతరుల ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…