Balakrishna: బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో తెలిసి మాట్లాడారా లేక పొరపాటుగా మాట్లాడారో తెలియదు కానీ అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున అక్కినేని ఫ్యామిలీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు బాలయ్య పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అక్కినేని హీరోలు నాగచైతన్య అఖిల్ స్పందించిన విషయం మనకు తెలిసిందే . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వర రావు ఈ విషయంపై స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ బాలకృష్ణ వేదికపై గొప్ప నటుల గురించి ఇలా జోక్ చేస్తూ మాట్లాడాలనుకోవడం చాలా తప్పు. గతంలో ఎన్నోసార్లు బాలకృష్ణ ఏఎన్నార్ గురించి ప్రస్తావిస్తూ తనకు ఏఎన్ఆర్ బాబాయ్ లాంటివారని చెప్పుకొచ్చారని సర్వేశ్వరరావు గుర్తు చేశారు. అయినా ఏఎన్నార్ వర్ధంతి రోజున వీర సింహారెడ్డి సక్సెస్ మీద పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు.
ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాగేశ్వరరావు వర్ధంతి కావడంతో రెండు నిమిషాల పాటు మౌనం వహించి ఆయనకు నివాళులు అర్పించాల్సింది.తారక రామారావు గురించి అలాగే నందమూరి హీరోల గురించి నాగార్జున ఎప్పుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు అంటూ సర్వేశ్వరరావు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించి కామెంట్లు చేశారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అభిమానులు భావించగా మరికొందరు క్షమాపణలు చెప్పకపోయినా పర్వాలేదు అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలైన వివరించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…