Categories: FeaturedMovie News

Adivi Sesh: ఘనంగా హీరో అడివి శేష్ సోదరి వివాహం… వైరల్ అవుతున్న హల్దీ ఫొటోలు!

Adivi Sesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారిలో నటుడు అడివి శేష్ ఒకరు. తాజాగా ఈయన మేజర్, హిట్ 2వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.

ఇక ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను అభిమానులతో పంచుకొనే శేష్ తాజాగా తన సోదరీ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

శేష్ సోదరి పేరు షెర్లీ ఈమె అమెరికాలో డాక్టర్. ఈమె అమెరికన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. ఈమె వివాహం జనవరి 26వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈమె పెళ్లికి సంబంధించిన ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హల్దీ వేడుకలలో భాగంగా శేష్ తన సోదరి తల్లితో కలిసి ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Adivi Sesh: మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం…

ఇక ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈయన షేర్ చేస్తూ…. బావ డెవిన్ గుడ్రిచ్ ను మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నాము అంటూఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ హల్ది వేడుకలలో భాగంగా మరొక కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు మరి నీ పెళ్ళెప్పుడు అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago