Tag Archives: padma bhusan award

Krishna: సూపర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Krishna: ఒక సాధారణ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ అనంతరం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలను సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈయనే మొదటి జేమ్స్ బాండ్ మొదటి కౌబాయ్. తెలుగువారి అల్లూరి ఎవరంటే కృష్ణ గారి పేరు చెబుతారు. సింహాసనంలో రారాజుగా వెలిగినటువంటి కృష్ణ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.

ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఈయన సాధించిన ఎన్నో అవార్డులు రివార్డులు మరే హీరోకి సాధ్యం కాలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో కొనసాగిన కృష్ణ 350 పైగా సినిమాలలో నటించడమే కాకుండా ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా అందుకున్నారు.2008వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకోవడమే కాకుండా 2009వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.

ఈ విధంగా కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం వెనుక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా తన కూతురు మంజులతో కలిసి చిట్ చాట్ నిర్వహించిన సమయంలో కృష్ణ వెల్లడించారు.ఈ క్రమంలోనే మంజుల మాట్లాడుతూ పద్మభూషణ్ బిరుదు రావడం పై మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించగా పద్మభూషణ్ కోసం తాను ప్రయత్నం చేయలేదని కృష్ణ వెల్లడించారు.

Krishna: వైయస్సార్ ప్రమేయంతోనే పద్మభూషణ్…


ఇకపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన మీకు పద్మభూషణ్ రాకపోవడం ఏంటి అని బాధపడి స్వయంగా ఆయనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన అనంతరం తన పేరును పద్మభూషణ్ అవార్డులో చేర్చారని ఆయన వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని కృష్ణ వెల్లడించారు. ఇక అప్పట్లో ఈ విషయం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కృష్ణ కోసం కేంద్రం పెద్దలను వైయస్సార్ ఎదిరించారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.