Tag Archives: patna

Priyamani: కోరిక తీర్చుకోవడానికి కుక్కలని కూడా వదలరా… యువకుడిపై మండిపడిన నటి ప్రియమణి!

Priyamani:ఈ సమాజంలో ఆడపిల్లలకు ఏమాత్రం రక్షణ లేదు అనే విషయం పలు సందర్భాలలో స్పష్టంగా నిరూపితం అవుతుంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు కూడా ఎవరికి ఎలాంటి ఆత్మరక్షణ లేదని, వయసుతో సంబంధం లేకుండా ఆడది అని తెలిస్తే చాలు వారిపై లైంగిక దాడులు చేస్తున్న సంఘటనలను మనం చూస్తూ ఉన్నాము.

ఇలా ఈ సమాజంలో మహిళలకు రక్షణ లేదని బాధపడుతున్న తరుణంలో చివరికి జంతువులకు కూడా రక్షణ లేదని తాజా సంఘటన నిరూపిస్తోంది. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఓ వ్యక్తి కుక్కను రేప్ చేశాడట. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై నటి ప్రియమైన స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఈ ఘటన గురించి ప్రియమైన స్పందిస్తూ చివరికి కుక్కల్ని కూడా వదలరా అంటూ ఈమె బూతులు తిడుతున్నటువంటి ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాజంలో మహిళలకే రక్షణ లేదనుకుంటే ఇప్పుడు జంతువులకు కూడా లేదనే ఉద్దేశంతో ఈమె ఈ పోస్ట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Priyamani:వరుస సినిమాలతో బిజీగా ప్రియమణి.

ఇక ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ పోస్టుపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రియమని సినిమాల విషయానికొస్తే ఒకప్పుడు నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమని ప్రస్తుతం హీరోయిన్ గా రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

వామ్మో.. వైట్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎంతటి ప్రళయం సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవించగా, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.ఈ విధంగా కరోనా బారిన పడిన వారు ఏదో విధంగా బతికి బయట పడుతుంటే వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో కొత్త వ్యాధి వెంటాడుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ వల్ల కొందరు కళ్ళు కోల్పోవడంతో పాటు మరణిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర భయాందోళన చెబుతున్న నేపథ్యంలో తాజాగా మరో వ్యాధి ప్రజలలో తీవ్ర కలకలం రేపుతోంది.

తాజాగా బీహార్ లో వైట్ ఫంగస్ కేసు నమోదు కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదివరకే నమోదైన బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకిన వారిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే వైద్యులు మరికొన్ని పరీక్షలు నిర్వహించగా వారిలో వైట్ ఫంగస్ గుర్తించినట్లు పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్‌ఎస్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా వైట్ ఫంగస్ కరోనా బారిన పడి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ, షుగర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి వైట్ ఫంగస్ తొందరగా సోకే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. వైట్ ఫంగస్ సిటి స్కాన్, ఎక్స్రే వంటి పరీక్షలు చేయడం ద్వారా గుర్తించవచ్చని వైద్యులు తెలిపారు.

కరోనా బారిన పడిన వారికి అందించే చికిత్సలో ఎక్కువ భాగం స్టెరాయిడ్లు ఉపయోగించడంతో పాటు అధిక నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ విధమైనటువంటి వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం కోసం ఎక్కువగా కులాయి నీళ్లు ఉపయోగిస్తున్నారు. కులాయి నీళ్లలో వైట్ ఫంగస్ ఉంటే అది ఊపిరితిత్తులకు చేరి ఇన్ఫెక్షన్ కి కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.