ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎంతటి ప్రళయం సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవించగా, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.ఈ విధంగా కరోనా బారిన పడిన వారు ఏదో విధంగా బతికి బయట పడుతుంటే వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో కొత్త వ్యాధి వెంటాడుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ వల్ల కొందరు కళ్ళు కోల్పోవడంతో పాటు మరణిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర భయాందోళన చెబుతున్న నేపథ్యంలో తాజాగా మరో వ్యాధి ప్రజలలో తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా బీహార్ లో వైట్ ఫంగస్ కేసు నమోదు కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదివరకే నమోదైన బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకిన వారిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే వైద్యులు మరికొన్ని పరీక్షలు నిర్వహించగా వారిలో వైట్ ఫంగస్ గుర్తించినట్లు పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్‌ఎస్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు ఆయన తెలిపారు.
సాధారణంగా వైట్ ఫంగస్ కరోనా బారిన పడి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ, షుగర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి వైట్ ఫంగస్ తొందరగా సోకే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. వైట్ ఫంగస్ సిటి స్కాన్, ఎక్స్రే వంటి పరీక్షలు చేయడం ద్వారా గుర్తించవచ్చని వైద్యులు తెలిపారు.
కరోనా బారిన పడిన వారికి అందించే చికిత్సలో ఎక్కువ భాగం స్టెరాయిడ్లు ఉపయోగించడంతో పాటు అధిక నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ విధమైనటువంటి వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం కోసం ఎక్కువగా కులాయి నీళ్లు ఉపయోగిస్తున్నారు. కులాయి నీళ్లలో వైట్ ఫంగస్ ఉంటే అది ఊపిరితిత్తులకు చేరి ఇన్ఫెక్షన్ కి కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…