Tag Archives: Penalty

రామ.. రామ అయేద్య రాముడి పేరుపై ట్రాఫిక్ చలానా.. సీటు బెల్టు పెట్టుకోలేదని..!

దేశంలో ఏ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ అయినా.. నిబంధనలకు విరుద్దంగా ఏ వాహనదారుడు అయినా వ్యవహరిస్తే అతడికి ఫైన్ వేస్తారు. అక్కడ ఆ నిబంధనకు అనుగురణంగా వాళ్లు ఫైన్ల రూపంలో డబ్బులను వసూలు చేస్తారు. అయితే కేరళలోని ట్రాఫిక్ పోలీసులు కాస్తంత అతి చేశారనే అనిపిస్తుంది. ఈ ఘటన చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది.

ఫైన్ వేసిన తర్వాత అతడి పేరుతో రసీదు ఇవ్వడం అనేది ట్రాఫిక్ పోలీసుల మొదటి కర్తవ్యం. అయితే ఇక్కడ కేరళ ట్రాఫిక్ పోలీస్ మాత్రం అయోద్య రాముడి పేరుమీద చలాన్ రాసి ఇచ్చాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాఫిక్‌ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేశారు. అయితే ఇదే కారణంతో అతడు ఒక గంట ముందు ఫైన్ కట్టాడు.

తాను అంతక ముందే కట్టాను అని వాళ్లకు చెప్పినా వినలేదు.. ఇక్కడ కూడా కట్టాలని వాళ్లు చెప్పారు. ఇక ఆ వాహనదారుడు చేసేది లేక అసలు పేరు కాకుండా అతడు.. తన పేరు రామా అని.. తన తండ్రి పేరు దశరథ అని.. ఊరు అయోద్య అని చెప్పాడు. కానీ పోలీస్ ఇవన్నీ వివరాలను ఆ రశీదు పై ఏ మాత్రం సందేహం రాకుండా రాశాడు. ఫైన్ వేశామా.. డబ్బు వసూలు చేశామా అన్నట్లే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కానీ.. వాహనదారుడు ఏ పేరు చెబితే మా కేంటి అన్నట్లు ఉంటుంది.

అలాగే అతడు రసీదు రాసి ఇచ్చాడు. అయితే వాహనదారుడు దానికి సంబంధించి రశీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అతడు చెప్పే పేరు, ఊరును కూడా అడగకుండా ఇలా రశీదు ఎలా రాస్తారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేరళలో పోలీసులు కారణం లేకుండా ఫైన్లు వేస్తున్నారంటూ.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ భారీ షాక్..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను అనుసరించని గోల్డ్ ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎర్నాకులంలో నిబంధనలను అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్ కు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది,

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సాధారణంగా గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వాల్సి వస్తే రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుందని ఆ నిబంధనలను పాటించని గోల్డ్ లోన్ సంస్థల విషయంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో పాటు మణప్పురం గోల్డ్ లోన్ సంస్థకు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది.

మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీ ఓనర్‌షిప్ వెరిఫికేషన్‌ నిబంధనలను పాటించలేదని త్రిసూర్‌లోని మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థకు ఆర్బీఐ 5 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ రెండు గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు పాటించకపోవడానికి గల కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పాల్సి ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఆర్బీఐ ప్రైవేట్ బ్యాంకులపై, గోల్డ్ ఫైనాన్స్ సంస్థలపై దృష్టి పెట్టింది.

లక్ష్మీవిలాస్ బ్యాంక్ కు కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ షాక్ ఇచ్చిన ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 16వ తేదీ వరకు లక్ష్మీవిలాస్ బ్యాంకుపై ఆర్బీఐ తాత్కాలిక మారటోరియం విధించింది. ఆర్బీఐ లక్ష్మీవిలాస్ బ్యాంక్ ను డీజీఎస్ బ్యాంక్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..?

ప్రస్తుత కాలంలో డబ్బులను పొదుపు చేయడం ఎంతో అవసరం. ఎవరైతే పొదుపు సూత్రాన్ని పాటిస్తారో వాళ్లు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే డబ్బు దాచుకోవడానికి బ్యాంకులు అతి సురక్షితమైనవి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఎక్కువ వడ్డీ ఆశించే వాళ్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఎఫ్‌డీ రిస్క్ లేని పెట్టుబడి కావడంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపుతారు.

అయితే ఎఫ్‌డీలలో వడ్డీల విషయానికి వస్తే ఒక్కో బ్యాంకులో ఒక్కో తరహా వడ్డీలు ఉంటాయి. మనం ఎంచుకునే మెచ్యూరిటీ కాలాన్ని బట్టే ఎఫ్‌డీల వడ్డీ ఆధారపడి ఉంటుంది. బ్యాంకును బట్టి ఎఫ్‌డీ వడ్డీరేట్లలో మార్పులు ఉండటంతో ముందుగానే ఎఫ్‌డీల విషయంలో అవగాహన ఏర్పరచుకుని డబ్బులను డిపాజిట్ చేయాలి. ఇలా డిపాజిట్ చేయడం వల్ల తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

అయితే ఎఫ్‌డీ డబ్బులను మెచ్యూరిటీ కాలం తర్వాతే తిరిగి పొందాలి. అలా చేయని పక్షంలో పెద్దగా వడ్డీ రాదు. బ్యాంకులు ఎఫ్‌డీల మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఎవరైనా రెన్యువల్ చేసుకోవాలని భావిస్తే నచ్చిన కాలపరిమితిని ఎంచుకొని సులభంగా ప్రయోజనం పొందే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.

చాలామంది ఆటోమేటిక్ రెన్యువల్ కు పాధాన్యతను ఇస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అయితే అత్యవసరమైతే బ్యాంకులో ఎఫ్‌డీ డబ్బులను ముందుగానే తీసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. అయితే ముందుగా డబ్బులు తీసుకోవాలని భావిస్తే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విషయాలపై సరైన అవగాహన ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.