రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను అనుసరించని గోల్డ్ ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎర్నాకులంలో నిబంధనలను అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్ కు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది,
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సాధారణంగా గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వాల్సి వస్తే రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుందని ఆ నిబంధనలను పాటించని గోల్డ్ లోన్ సంస్థల విషయంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో పాటు మణప్పురం గోల్డ్ లోన్ సంస్థకు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది.
మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీ ఓనర్‌షిప్ వెరిఫికేషన్ నిబంధనలను పాటించలేదని త్రిసూర్‌లోని మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థకు ఆర్బీఐ 5 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ రెండు గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు పాటించకపోవడానికి గల కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పాల్సి ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఆర్బీఐ ప్రైవేట్ బ్యాంకులపై, గోల్డ్ ఫైనాన్స్ సంస్థలపై దృష్టి పెట్టింది.
లక్ష్మీవిలాస్ బ్యాంక్ కు కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ షాక్ ఇచ్చిన ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 16వ తేదీ వరకు లక్ష్మీవిలాస్ బ్యాంకుపై ఆర్బీఐ తాత్కాలిక మారటోరియం విధించింది. ఆర్బీఐ లక్ష్మీవిలాస్ బ్యాంక్ ను డీజీఎస్ బ్యాంక్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…