రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను అనుసరించని గోల్డ్ ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎర్నాకులంలో నిబంధనలను అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్ కు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది,

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సాధారణంగా గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వాల్సి వస్తే రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుందని ఆ నిబంధనలను పాటించని గోల్డ్ లోన్ సంస్థల విషయంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో పాటు మణప్పురం గోల్డ్ లోన్ సంస్థకు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది.

మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీ ఓనర్‌షిప్ వెరిఫికేషన్‌ నిబంధనలను పాటించలేదని త్రిసూర్‌లోని మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థకు ఆర్బీఐ 5 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ రెండు గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు పాటించకపోవడానికి గల కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పాల్సి ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఆర్బీఐ ప్రైవేట్ బ్యాంకులపై, గోల్డ్ ఫైనాన్స్ సంస్థలపై దృష్టి పెట్టింది.

లక్ష్మీవిలాస్ బ్యాంక్ కు కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ షాక్ ఇచ్చిన ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 16వ తేదీ వరకు లక్ష్మీవిలాస్ బ్యాంకుపై ఆర్బీఐ తాత్కాలిక మారటోరియం విధించింది. ఆర్బీఐ లక్ష్మీవిలాస్ బ్యాంక్ ను డీజీఎస్ బ్యాంక్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here