ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. మోసాలపై అవగాహన లేనివాళ్లతో పాటు అవగాహన ఉన్నవాళ్లను సైతం కొందరు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బాళ గోపనహళ్లి పోస్ట్ ఆఫీస్ లో పార్శిల్ తీసుకుని డబ్బులు చెల్లించిన ఒక వ్యక్తి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దంటూ కోరుతున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లికి చెందిన నరసింహామూర్తి చాలా రోజుల నుంచి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు. అతను ఆన్ లైన్ లో సెర్చ్ చేసే సమయంలో తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ విక్రయిస్తున్నట్టు ప్రకటన కనిపించింది. స్మార్ట్ ఫోన్ ధర కేవలం 1700 రూపాయలు కావడంతో నరసింహమూర్తి ఆనందంతో స్మార్ట్ ఫోన్ ను ఆర్డర్ చేశాడు.
కొందరు వ్యక్తులు నరసింహమూర్తికి ఫోన్ చేసి ఫోన్ ను పోస్టాఫీస్ ద్వారా తీసుకోవాలని సూచించగా వాళ్లు చెప్పిన విధంగా నరసింహమూర్తి హెబ్బాళ నుంచి గోపనహళ్లి పోస్టాఫీస్ కు వెళ్లి పార్శిల్ ఓపెన్ చేసి చూశాడు. పార్శిల్ లో ఫోన్ కు బదులుగా సోన్ పాపిడి మిఠాయిలు, రోల్డ్ గోల్డ్ చైన్ ఉండటంతో షాక్ కావడం నరసింహమూర్తి వంతయింది. నరసింహమూర్తి పోలీసులకు ఆన్ లైన్ మోసం గురించి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
ఎవరైనా ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తే ప్రముఖ ఈకామర్స్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తే మంచిది. లేదంటే డూప్లికేట్ ఉత్పత్తులు రావడం, డబ్బులు మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…