వెలుగులోకి మరో మోసం.. స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందంటే..?

0
139

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. మోసాలపై అవగాహన లేనివాళ్లతో పాటు అవగాహన ఉన్నవాళ్లను సైతం కొందరు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బాళ గోపనహళ్లి పోస్ట్ ఆఫీస్ లో పార్శిల్ తీసుకుని డబ్బులు చెల్లించిన ఒక వ్యక్తి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దంటూ కోరుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లికి చెందిన నరసింహామూర్తి చాలా రోజుల నుంచి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు. అతను ఆన్ లైన్ లో సెర్చ్ చేసే సమయంలో తక్కువ ధరకే శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ విక్రయిస్తున్నట్టు ప్రకటన కనిపించింది. స్మార్ట్ ఫోన్ ధర కేవలం 1700 రూపాయలు కావడంతో నరసింహమూర్తి ఆనందంతో స్మార్ట్ ఫోన్ ను ఆర్డర్ చేశాడు.

కొందరు వ్యక్తులు నరసింహమూర్తికి ఫోన్ చేసి ఫోన్ ను పోస్టాఫీస్ ద్వారా తీసుకోవాలని సూచించగా వాళ్లు చెప్పిన విధంగా నరసింహమూర్తి హెబ్బాళ నుంచి గోపనహళ్లి పోస్టాఫీస్ కు వెళ్లి పార్శిల్ ఓపెన్ చేసి చూశాడు. పార్శిల్ లో ఫోన్ కు బదులుగా సోన్‌ పాపిడి మిఠాయిలు, రోల్డ్ గోల్డ్ చైన్ ఉండటంతో షాక్ కావడం నరసింహమూర్తి వంతయింది. నరసింహమూర్తి పోలీసులకు ఆన్ లైన్ మోసం గురించి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.

ఎవరైనా ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తే ప్రముఖ ఈకామర్స్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తే మంచిది. లేదంటే డూప్లికేట్ ఉత్పత్తులు రావడం, డబ్బులు మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here