Tag Archives: phones

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

Health Tips: ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్కూలుకెళ్లే పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ లో ఫోన్ వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పటంలో సందేహం లేదు. ఐతే చాలామంది నిద్రపోయే సమయంలో కూడా సెల్ ఫోన్లు దిండు కింద పెట్టుకొని మరి నిద్రపోతున్నారు. ఇలాంటి అలవాటు ఉన్న వారు ప్రమాదంలో పడినట్టే.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజు తలకింద సెల్ ఫోన్ పెట్టుకొని పడుకోవడం వల్ల దాని రేడియేషన్ కి క్యాన్సర్, ట్యూమర్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

రాత్రివేళ నిద్రించే సమయంలో మెదడులో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి అవటం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. ఒకవేళ నిద్రపోయే సమయంలో లో సెల్ ఫోన్ తలక్రింద పెట్టుకొని పడుకోవడం వల్ల సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ కి ఈ హార్మోన్ విడుదల అవ్వదు. అందువల్ల నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడతారు.

మెదడుపై అధిక ప్రభావం చూపుతుంది…

సెల్ ఫోన్ తల కింద పెట్టుకొని పడుకోవడం వల్ల దాని నుండి వచ్చే రేడియేషన్ మన మన మెదడు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. తద్వారా నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు నిద్ర పోయే సమయంలో వారి దరిదాపుల్లో కూడా సెల్ఫోన్ ఉండకుండా చూడాలి.

ట్రూ కాలర్ వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

ట్రూ కాలర్.. ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతీ ఒక్కరి ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది. అపరిచత వ్యక్తులు.. లేదా కొత్త నంబర్ల నుంచి ఏమైనా ఫోన్లు వస్తే.. ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ యాప్‌ను చాలా మంది వాడుతుంటారు. అంతే కాదు ఇటీవల ట్రూకాలర్ కూడా.. పేమెంట్ ఆప్షన్ ను కల్పించింది.

యూపీఐ ద్వారా దీని నుంచి కూడా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ సరికొత్త రికార్డును నెలకొల్పిందట. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరిందని… అందులో మన భారతీయులే 22 కోట్ల మంది ఉన్నారంటూ.. ఆ సంస్థ ప్రతి నిధులు తెలిపారు. అంటే దాదాపు నలుగలో మూడొంతుల మన భారతీయులే ఉన్నారు.

ఈ ఏడాది యూజర్ల సంఖ్య 25 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ యాప్ సేవలు దాదాపు 11 ఏళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. మొదట ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. తర్వాత దీనిపై ఎక్కువగా నమ్మకం కలగడంతో.. వాడటం మొదలు పెట్టారు. ఇప్పటికి ఈ స్థితికి చేరుకున్నారు.

ఈ ట్రూకాలర్ యాప్ అనేది కేవలం కాలర్ ఐడెంటిటీ మాత్రమే తెలుసుకోవడమే కాదు.. స్పామ్‌ బ్లాకింగ్‌, స్మార్ట్‌ ఎస్సెమ్మెస్‌, ఇన్‌ బాక్స్‌ క్లీనర్‌, ఫుల్‌ స్క్రీన్‌ కాలర్‌ ఐడీ, గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌.. ఇలా అనేక కొత్త సదుపాయాలను అందిస్తోంది. ఇంకా మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొత్త యూజర్లు చాలామంది వస్తున్నారని.. ఒక్క ఏడాదిలోనే 5 కోట్ల మంది ఈ యాప్ ను తమ మొబైల్లో ఇన్ స్టాల్ చేసుకున్నారని తెలిపింది.