Tag Archives: Pia Baz

Pia Bajpai : సమంత లాగే నాకు మయోసైటిస్ ఉంది.. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా : రంగం బ్యూటీ పియా భజ్ పెయ్

Pia Bajpai : తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా అతి భయంకరమైనటువంటి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా సమంత ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిన అనంతరం తాము కూడా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడ్డామని ఎంతోమంది నటీమణులు వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.

ఇప్పటికే మాయోసైటీస్ వ్యాధి గురించి కల్పిక గణేష్, పూనం కౌర్, వంటి నటి మనులు తాము కూడా సమంత లాంటి వ్యాధితోనే బాధపడ్డామని తెలిపారు. అయితే తాజాగా జీవ హీరోగా నటించిన రంగం సినిమాలో నటించిన నటి పియా బాజ్పెయి సైతం తాను కూడా సమంత లాంటి వ్యాధితోనే బాధపడ్డానని తెలిపారు.

తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చికిత్స లేనటువంటి ఈ వ్యాధితో బాధపడటం ఎంతో నరకంగా ఉంటుందని ఈమె తెలిపారు.సమంత ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలియగానే చాలా బాధ కలిగిందని ఆమె పడుతున్న ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని నటి వెల్లడించారు.

s

Samantha Myositis: ఇంట్లో చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకున్నా…


ఇక తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని తెలియగానే ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం చెప్పకుండా ముంబైలో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నానని ఈమె ఈ సందర్భంగా తెలిపారు. ఇలా మయోసైటిసిస్ వ్యాధి గురించి నటి పియా బాజ్ పాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత గత కొంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.