Pia Bajpai : తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా అతి భయంకరమైనటువంటి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా సమంత ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిన అనంతరం తాము కూడా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడ్డామని ఎంతోమంది నటీమణులు వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.
ఇప్పటికే మాయోసైటీస్ వ్యాధి గురించి కల్పిక గణేష్, పూనం కౌర్, వంటి నటి మనులు తాము కూడా సమంత లాంటి వ్యాధితోనే బాధపడ్డామని తెలిపారు. అయితే తాజాగా జీవ హీరోగా నటించిన రంగం సినిమాలో నటించిన నటి పియా బాజ్పెయి సైతం తాను కూడా సమంత లాంటి వ్యాధితోనే బాధపడ్డానని తెలిపారు.
తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చికిత్స లేనటువంటి ఈ వ్యాధితో బాధపడటం ఎంతో నరకంగా ఉంటుందని ఈమె తెలిపారు.సమంత ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలియగానే చాలా బాధ కలిగిందని ఆమె పడుతున్న ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని నటి వెల్లడించారు.
ఇక తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని తెలియగానే ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం చెప్పకుండా ముంబైలో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నానని ఈమె ఈ సందర్భంగా తెలిపారు. ఇలా మయోసైటిసిస్ వ్యాధి గురించి నటి పియా బాజ్ పాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత గత కొంతకాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…