Categories: FeaturedGeneral News

Mr. Tea Naveen reddy, vaishali Issue : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అరెస్టు..??

Mr. Tea Naveen Reddy, Vaishali Issue : రంగారెడ్డి జిల్లా ఆధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డికి అంతకుముందే ప్రేమ వ్యవహారం ఉందంటూ ఆ అమ్మాయికి కాస్ట్లి కారు గిఫ్ట్ ఇచ్చాడు అంటూ బయట ప్రచారం జరుగుతోంది. ఇక వ్యాపారవేత్తగా చిన్న వయసులోనే సక్సెస్ అయిన నవీన్ రెడ్డి ఈ ఒక్క సంఘటనతో ఒక్కసారిగా తాను తెచ్చుకున్న మంచి పేరును చెడగొట్టుకున్నాడు.

నవీన్ రెడ్డి అరెస్ట్…

కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు పోలీసులు దాదాపు 32 మందిని అరెస్టు చేయగా మిగిలిన వాళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ1 గా ఉన్నా నవీన్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసారంటూ ఓవైపు ప్రచారం జరుగుతున్నా నవీన్ రెడ్డి ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పడం లేదు. పోలీసులు నవీన్ రెడ్డి ని అరెస్టు చేసినా చేయలేదని చెప్తున్నారంటూ మరో వాదన వినిపిస్తోంది. ఇక నవీన్ రెడ్డి ఇంటి దగ్గర స్థానికులు మాత్రం నవీన్ ను పోలీసులు అరెస్టు చేసారు కానీ బయటకు చెప్పడం లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు.

నిజానికి నవీన్ పరారీలో ఉన్నాడు ఇంకా ఆచూకీ లభించలేదు అంటూ పోలీసులు చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియదు. ఇక వైశాలి ఇంటి వద్ద పోలీసులు కాపలా కస్తున్నారు. మీడియా వాళ్ళను కూడా అనుమతించడం లేదు. వైశాలి ఆల్రడీ చెప్పాలిసింది చెప్పేసిందని ఇక మాట్లాడదంటూ ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. వైశాలి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ మాట్లాడాటానికి నిరాకరిస్తున్నారు. అయితే ఈ ఇష్యూలో ఇంకా మున్ముందు ఏం జరుగుతోంది అన్న ఆసక్తి అందరూలోనూ ఉన్నది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago