Featured

Tharakarama Theater : అప్పట్లో ఎన్టీఆర్ ఎంతో అపురూపంగా కట్టించుకున్న థియేటర్… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Tharakarama theater : కాచిగూడ తారకరామ సిని ఫ్లెక్స్ నందమూరి తారక రామారావు గారు కట్టించిన థియేటర్. ఆ థియేటర్ లో అప్పట్లో వంద రోజులు ఆడిన సినిమాలు ఎన్నో. హిందీ సినిమాలు సైతం సూపర్ హిట్లుగా ఆడిన ఆ థియేటర్ మరో సారి పూర్వవైభవం తెచ్చుకోనుంది. తారకరామ థియేటర్ మధ్యలో పట్టించుకునేవాళ్ళు లేక కొద్ది రోజు బి గ్రేడ్ మూవీస్ కూడా వేసేవారు. అయితే ఆసియన్ వాళ్ళు యాజమాన్య బాధ్యతలను తీసుకుని థియేటర్ ను బాగు చేసారు.

బాలయ్యతో రీ ఓపెన్…

ప్రస్తుతం మల్టీ ప్లెక్స్ లదే హవా. లేటెస్ట్ టెక్నాలజీ, సీటింగ్ లోనూ కంఫర్టబిలిటీ జనాలు కోరుకుంటున్నారు. దీంతో తారకరామ థియేటర్ ను ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్ కు మరమ్మత్తులు చేపట్టారు. తాజాగా మోడిఫికేషన్ పూర్తయింది. నారాయణ్ దాస్ కొడుకు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీ తో థియేటర్ కు కొత్త హంగులను చేకూర్చారు. 4K ప్రాజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ తో పాటు, సీటింగ్ లోనూ మార్పులు చేసారు.

975 సీటింగ్ ఉన్న ఈ థియేటర్ లో ప్రస్తుతం 590 కి కుదించారు. రెక్లైనర్‌, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునఃప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్‌ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణకు సునీల్‌ నారంగ్, భరత్‌ నారంగ్‌, సురేశ్‌ బాబు, సదానంద గౌడ్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఇక నందమూరి బాలకృష్ణ ఈ థియేటర్ ను మళ్ళీ డిసెంబర్ 14న రీ ఓపెన్ చేయబోతున్నారు.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

3 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

3 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

3 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

3 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

3 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

3 hours ago