Featured

Senior Journalist Imandhi Ramarao : ఆ కారణాలతోనే శోభన్ బాబు, రంగనాథ్ మధ్య గొడవలు… ఆ రోజు రంగనాథ్ నాతో ఏం చెప్పాడంటే..: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ‘బుద్ధిమంతులు’ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన రంగనాథ్ గారు పుట్టింది మద్రాస్ అయితే టికెట్ కలెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. అయితే ఒడ్డు పొడుగు ఉన్నావ్ సినిమాల్లో ప్రయత్నిచవచ్చు కదా అని చాలా మంది సలహాలు ఇవ్వడంతో సినిమాల్లో ప్రయత్నిచాలని భావించి అవకాశాల కోసం కష్టపడగా మొదట బుద్ధిమంతులు సినిమాతో నటుడయ్యారు. ఇక ఆ తరువాత ‘చందన’ సినిమాతో హీరో అయ్యారు. దాదాపు 300 వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా చేసి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాల్లో చేసారు.

శోభన్ బాబు తో గొడవలు…

రంగనాథ్ గారు హీరోగా అప్పుడప్పడే హిట్లు కొడుతున్న సమయంలో శోభన్ బాబు గారు చెప్పిన మాటలు రంగనాథ్ గారిని బాధపెట్టాయి అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. హీరోగా ఎదుగుతున్న సమయంలో శోభన్ బాబు గారిని వారాహి స్టూడియోలో పలకరించగా ఆయన నువ్వు ఎస్విఆర్, గుమ్మడి లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించు, నీకు లాంగ్ రన్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఉంటుంది, హీరోగా కొంత కాలమే నటించగలవు అని చెప్పారట. అయితే ఆ మాటలకు రంగనాథ్ గారు బాధపడ్డారట. హీరోగా బాగా రానిస్తున్న సమయాల్లో ఇలా ముసలి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయమన్నారేంటి నన్ను చూసి ఆయన ఈర్ష్య పడుతున్నారా అని భాధపడ్డారట.

హీరోగా చేస్తున్న సమయంలో విలన్ గాను సినిమాలు చేయడంతో విలన్ అవకాశాలు రావడం ఎక్కువైంది, ఆ తరువాత రాను రాను రంగనాధ్ గారి అవకాశాలు సన్నగిల్లాయి, ఇక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా పాత్రలను చేశారు. ఇక చివరికి సీరియల్స్ లోనూ నటించారు. ఆయన శోభన్ బాబు చనిపోయాక ఒకసారి ఇమంది గారితో ఆ రోజున శోభన్ బాబు గారు చెప్పిన మాటలు వినుంటే ఈ రోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా మంచి గగుర్తింపు తో ఉండేవాడిని కదా అంటూ బాధపడ్డారట. ఈ విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

4 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

4 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

4 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

5 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

5 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

5 hours ago