Mr. Tea Naveen Reddy : రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డికి అంతకుముందు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఆ అమ్మాయికి కాస్ట్లి కారు గిఫ్ట్ ఇచ్చాడు అంటూ బయట ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరొక ట్విస్ట్ ఈ ఇష్యూలో బయట పడింది.
మహిళ దుస్తులు… ఓయో రూమ్ బుకింగ్…
కిడ్నాప్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. నవీన్ రెడ్డి ని అరెస్టు చేశారు పోలీసులు అని కొందరు చెబుతుంటే మరో వైపు నవీన్ రెడ్డి పారారీలో ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. నవీన్ రెడ్డి కిడ్నాప్ అనంతరం ప్రయాణించిన కారులో ఒక మహిళ దుస్తులు ఉన్న బ్యాగ్ దొరకడం, ఇక ఓయో రూమ్ బుక్ చేసినట్లు మళ్ళీ అది చెక్ అవుట్ చేసినట్లు పోలీసులు వెతికిన ఆధారాల్లో లభ్యమైంది. అయితే నవీన్ ను గోవా లో పట్టుకున్నట్లు ప్రస్తుతం వినిపిస్తోంది. వైశాలిని కిడ్నాప్ చేసి మూడు రోజులు తనతో ఉండాల్సిందిగా తెలిపాడు.
ఆ అమ్మాయి ఏడ్చి ఒప్పుకోక పోవడంతో మార్గమధ్యలోనే వదిలి వెళ్ళాడు అంటూ వార్తలు వినిపిస్తున్నా నిజానిజాలు తెలియయాల్సి ఉంది. కాగా తాజాగా నవీన్ కి సంబందించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో అందరూ వైశాలి వైపు మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయం గురించి ఏంటి అంటూ మాట్లాడటం, నా స్థానంలో ఒక అమ్మాయి ఉంటే ఇలానే మాట్లాడేవారా అంటూ మాట్లాడిన వీడియో ఒకటి హల్చల్ చెస్తోంది. మొత్తానికి పూటకో ట్విస్టు తో సాగుతున్న నవీన్ రెడ్డి వైశాలి రెడ్డి ఇష్యూలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కష్టమే…
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…