Tharakarama theater : కాచిగూడ తారకరామ సిని ఫ్లెక్స్ నందమూరి తారక రామారావు గారు కట్టించిన థియేటర్. ఆ థియేటర్ లో అప్పట్లో వంద రోజులు ఆడిన సినిమాలు ఎన్నో. హిందీ సినిమాలు సైతం సూపర్ హిట్లుగా ఆడిన ఆ థియేటర్ మరో సారి పూర్వవైభవం తెచ్చుకోనుంది. తారకరామ థియేటర్ మధ్యలో పట్టించుకునేవాళ్ళు లేక కొద్ది రోజు బి గ్రేడ్ మూవీస్ కూడా వేసేవారు. అయితే ఆసియన్ వాళ్ళు యాజమాన్య బాధ్యతలను తీసుకుని థియేటర్ ను బాగు చేసారు.

బాలయ్యతో రీ ఓపెన్…
ప్రస్తుతం మల్టీ ప్లెక్స్ లదే హవా. లేటెస్ట్ టెక్నాలజీ, సీటింగ్ లోనూ కంఫర్టబిలిటీ జనాలు కోరుకుంటున్నారు. దీంతో తారకరామ థియేటర్ ను ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్ కు మరమ్మత్తులు చేపట్టారు. తాజాగా మోడిఫికేషన్ పూర్తయింది. నారాయణ్ దాస్ కొడుకు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీ తో థియేటర్ కు కొత్త హంగులను చేకూర్చారు. 4K ప్రాజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ తో పాటు, సీటింగ్ లోనూ మార్పులు చేసారు.

975 సీటింగ్ ఉన్న ఈ థియేటర్ లో ప్రస్తుతం 590 కి కుదించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునఃప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, సురేశ్ బాబు, సదానంద గౌడ్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఇక నందమూరి బాలకృష్ణ ఈ థియేటర్ ను మళ్ళీ డిసెంబర్ 14న రీ ఓపెన్ చేయబోతున్నారు.































