Kalpika Ganesh: కల్పిక గణేష్ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. కల్పిక గణేష్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ఈమె సమంత నటించిన యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె తాను కూడా మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డానని అయితే తన ఫస్ట్ స్టేజిలో ఉన్నాననే విషయాలను కూడా తెలియజేశారు.
ఇకపోతే కల్పిక గణేష్ తాజాగా తన యూట్యూబ్ ద్వారా మరొక నటి ధన్య బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ధన్య బాలకృష్ణ పెళ్లి అయ్యి విడాకులు ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ అనే వ్యక్తిని ఈ ఏడాది జనవరిలో రెండవ వివాహం చేసుకున్నారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఈ వీడియో కాపీరైట్స్ కారణంగా డిలీట్ అయినప్పటికీ ఈ వీడియోలో భాగంగా కల్పిక ధన్య బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ధన్య బాలకృష్ణ సినిమా షూటింగుల నిమిత్తం చెన్నై వెళ్ళినప్పుడు ఆమె ఎక్కువగా బాలాజీ మోహన్ తోనే ఉండేదని అయితే అప్పటికే ఆయనకు వివాహం జరిగి విడాకులు కూడా అయ్యాయని తెలిపారు. తమిళ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారని తెలిపారు.
వీరి వివాహం జరిగి ఏడాదికావస్తున్న వీరి విషయాన్ని రహస్యంగా ఉంచారు.ఇక వీరి పెళ్లి విషయం తెలిసి తాను కాస్త ఆందోళన చెందాలని బాలాజీ తనని ఎక్కడ టార్చర్ చేస్తారని ఆందోళన చెందాను. అయితే అతను తనని బాగా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయానికి వస్తే..తాను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. అయితే తనని బాలాజీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో అనిపించి ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టానని కల్పికా తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…