Actress Anjali : తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈమె సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, గీతాంజలి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి అంజలి జర్నీ సినిమాలో తనతో పాటు కలిసిన నటుడు జైతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచుకోకుండా బయటపెట్టారని అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది.
ఇలా నటుడు జై తో అంజలి బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ ఈమె ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారు.అయితే కొన్ని రోజులుగా అంజలి పెళ్లి చేసుకుందని ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది అంటూ తన పెళ్లి గురించి ఏవేవో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై స్పందించిన అంజలి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ… కొన్ని సంవత్సరాల క్రితం తాను టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపారు.ఆ రిలేషన్ పై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని అయితే తాను ఊహించిన అందంగా తన రిలేషన్ లేదని తెలిపారు. అయితే తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు.తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరితో రిలేషన్ లో ఉన్నాననేది పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ ఈ సందర్భంగా అంజలి రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…