Tag Archives: PM Kisan Summon nidhi Scheme

రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఒకేరోజు రెండు పథకాల డబ్బులు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల 29వ తేదీన జమ చేయనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 50 లక్షలకు పైగా రైతులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు జమ చేయనుంది.

అయితే తాజాగా జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతు భరోసా స్కీమ్ నగదుతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులను సైతం అదే రోజు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన ఇన్ పుట్ సబ్సిడీ నగదును రైతుల ఖాతాలలో జమ చేయాలని భావించింది. అయితే రెండు రోజుల వ్యవధిలో రెండు స్కీమ్ ల నగదు జమ చేసే కంటే ఒకేరోజు రెండు స్కీమ్ ల నగదు జమ చేస్తే మంచిదని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందే రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ స్కీమ్ లను అమలు చేస్తూ ఉండటంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు తీపికబరు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 7వ విడత నిధులను ఈ నెల 25వ తేదీన జమ చేయనుంది. దేశంలోని 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో నగదు జమ కానుందని తెలుస్తోంది.