Tag Archives: police case

హీరో విజయ్ సొంత తల్లిదండ్రులపై కేసు ఎందుకు పెట్టాడో తెలుసా?

తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌ తన తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం కోలివుడ్‌ వర్గాల్లో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టడం ఏంటని.. గుసుగుసలు వినిపించాయి. ఎలాంటి అనుమతి లేకుండా తన పేరును వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారంటూ విజయ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాకుండా అతడు గత ఎన్నికల సమయంలో తండ్రిపై కేసు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం విజయ్ పేరుతో ‘విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పార్టీ పెట్టారు. దీనికి తన తండ్రి చంద్రశేఖర్ జనరల్‌ సెక్రటరీగా, భార్య శోభా చంద్రశేఖర్‌ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని ఇప్పటికే పలు మార్లు మీడియాకు వెల్లడించారు హీరో విజయ్.

అభిమాన సంఘాలు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవద్దని కోరారు. గతంలో కూడా తన తండ్రిపై కేసు పెట్టాడు. ప్రస్తుతం తన ప్రమేయం లేకుండా.. పార్టీ వ్యవహారాల్లో తన ఫొటోను వాడుకుంటున్నారని, అభిమాన సంఘాలను కూడా భాగం చేస్తున్నారని విజయ్‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులతో పాటు పార్టీ ముఖ్యనేతలుగా భావిస్తున్న మరో పదకొండు మందిపై విజయ్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.

తన పేరు మీద లేదా అతడి అభిమాన సంఘం పేరును ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ చెన్నై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. తమిళనాట అత్యంత ప్రాచుర్యం కలిగిన కథానాయకుడు విజయ్‌ సొంత తల్లిదండ్రులపై కోర్టుకెక్కడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. స్థానిక ఎన్నికల్లో తన అభిమాన సంఘం ‘విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్’ స్వతంత్రంగా పోటీచేస్తుందని ఆయన తెలిపారు.

సొంత బాబాయ్ బాలికపై అత్యాచారం చేశాడు.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా..

పాఠశాలలు దేశంలోని చాలా రాష్ట్రాలలో మొదలు అయ్యాయి. ఉదయం పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. ఇలా వాళ్లే స్కూల్ వద్ద వదిలి పెట్టి.. మళ్లీ సాయంత్రం వెళ్లి పిక్ అప్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ఓ ఇంట్లో పని ఎక్కువగా ఉండటంతో ఓ తల్లి తన పాపను పాఠశాల వద్ద దింపి రావడానికి ఆ పాపకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని సహాయం అడిగింది.

అలాగే ఆ బాలికను తీసుకెళ్లిన అతడు.. దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మండ్య నగరంలో దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకు ఓ పాప ఉంది. పాఠశాలకు సమయం దగ్గర పడుతుండటంతో.. తనకు వేరే పని ఉందని.. పాపకు బాబాయ్ వరుస అయ్యే 32 ఏళ్ల సల్మాన్ ను సహాయం అడిగింది. అతడు అలాగే అని అక్కడ నుంచి తీసుకెళ్లాడు.

తన అన్న కూతురును పాఠశాలకు తీసుకెళ్లకుండా నేరుగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశారు. సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ బాలికను చూసిన తల్లిదండ్రులు ముఖంపై గాయాలు ఉండటం గమనించారు. ఆ బాలికను గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. ఈ దారుణానికి పాల్పడింది బాబాయ్ అంటూ చెప్పింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని ఆరోజే అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానికంగా మహిళా సంఘం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలిన డిమాండ్ చేశారు.

అతడికి పుర్రె లేకుండానే వైద్యులు ఆపరేషన్ చేశారు.. ఎందుకు ఇలా చేశారంటే..!

మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన కీర్తి పార్మర్ కు కొన్నేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అతడు ఇండోర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కలిశాడు. స్కానింగ్ చేసిన వైద్యులు బ్యెయిన్ ట్యూమన్ ఉందని.. దానిని తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు. దీంతో అతడు 2019లో ఆపరేషన్ చేయించుకున్నాడు. పుర్రెలోని కుడివైపు భాగాన్ని పగలకొట్టి ట్యూమర్ తొలగించారు. తర్వాత ఆ పుర్రెను అతికించకుండానే చర్మంతో కుట్టేశారు. ఎందుకు అలా చేశారంటే.. బయటకు తీసిన ఆ పుర్రె పగిలిపోయింది.

అందువల్ల ఇక అతను ఎప్పటికీ ఆ పుర్రె ముక్క లేకుండానే బతకాల్సి వస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పుర్రె ముక్క లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసేశారనీ… తమకు న్యాయం చెయ్యాలని కీర్తి పార్మర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ.. అతడికి మెదడులో అయింది చిన్న గడ్డ కాదు.. దాన్ని తొలగించాలంటే పుర్రెలోని కీలక భాగాన్ని తొలగించక తప్పలేదు.

తర్వాత దానిని తిరిగి అమర్చాలంటే… ఆ పుర్రె ముక్క పద్ధతిగా ఉండాలి. కానీ ఆపరేషన్ సమయంలో… పుర్రె ముక్క పద్ధతిగా రాలేదు. ముక్కలైపోయింది. ఇలా జరిగే అవకాశం ఉందనీ… అలా జరిగితే… పుర్రెను తిరిగి సెట్ చెయ్యడం కుదరదని ముందే చెప్పినట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. వారు దానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. అంచనా వేసినట్లుగానే అది ముక్కలైపోయింది. కాబట్టి… తిరిగి సెట్ చెయ్యడం కుదరలేదన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసి బాధిత కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ కోరారు. పేషెంట్ వైపు నుంచి చూస్తే అయ్యో అనిపించడం సహజం. వైద్యులు విషయానికి వస్తే వాళ్లు ఆపరేషన్ పూర్తి చేశారు. కానీ వాళ్లనే నిందించడం అనేది పద్దతి కాదంటూ పోలీసులు తెలిపారు. దీనిపై చివరకు ఎవరు రాంగ్.. ఎవరు తప్పు అనేది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది.

పిల్లికి పాలు పోసిందని మహిళపై కేసు పెట్టిన స్థానికులు.. కారణం?

సాధారణంగా మన ఇంట్లో పెంపుడు జంతువులకు అవి చిన్నవిగా ఉంటే వాటి ఆకలి తీర్చడానికి పాలు పోయడ మనం చూస్తూనే ఉంటాం. అచ్చం ఇదే తరహాలో ఓ మహిళ పిల్లికి పాలు పోయడంతో ఆమె పై పోలీస్ కేసు పెట్టి కోర్టుకి ఈడ్చారు. పిల్లికి పాలు పోస్తే కేసు పెట్టడం ఏంటి? అని ఆశ్చర్య పోతున్నారు కదా! అవును ఆ ప్రాంతంలో ఈ విధంగా పిల్లికి పాలుపోయడం నేరమని ఆ విధంగా పిల్లికి పాలు పోయడం చూసిన స్థానికులు ఆ మహిళ పై కేసు పెట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో ఓ పార్కులో మహిళ పిల్లికి ఒక గిన్నెలో పాలు పోసింది. ఈ సంఘటనను చూసిన స్థానికులు78 ఏళ్ల జాన్ పీ హస్సీపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అలా ఎందుకు పెట్టారంటే…టాంపా రాక్వెస్ట్ క్లబ్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం కేవలం పెంపుడు జంతువులకు మినహా ఇతర జంతువులకు వారి కాలనీలో అనుమతి లేదు.

ఆ విధంగా ఆ కాలనీలో ఏ ఇతర జంతువులకైనా పాలుపోయడం, ఆహారం పెట్టడం వంటివి చేయడం నిషేధం. ఆ విధంగా చేసిన వారు నిబంధనలను ఉల్లంఘించినట్లని భావించి వారిపై కేసు నమోదు చేస్తారు. ఈ సందర్భంగానే జాన్ పీ హస్సీపై కూడా కేసు నమోదు చేశారు. అమెరికా వాసులు నల్ల పిల్లి, గుడ్లగూబను అశుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటికి ఆహారం పెట్టడం వల్ల ఆ శుభం జరుగుతుందని వారు భావిస్తారు. అయితే జాన్ పీ హస్సీపై నల్ల పిల్లికి పాలు పోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ విధంగా కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం ఫ్లోరిడాలోని కోర్టులో జరుగుతుంది.ఈ విషయంపై ఆ వృద్ధురాలు మాట్లాడుతూ నాకు ఆకలిగా ఉన్న పిల్లి, కుక్కలకు పాలు పోయడం అలవాటని ఎప్పుడు కారులో తనతో పాటు కొన్ని లీటర్ల పాలు తీసుకు వెళుతుంటారని ఈ విధంగానే అక్కడికి వచ్చిన పిల్లికి పాలు పోశాననీ తెలిపారు. అదేవిధంగా నా దృష్టిలో నలుపు-తెలుపు అని సంబంధం లేదు జంతువులను ఒక్కటేనని అందుకోసమే వాటికి పాలుపోసానని, పాలు పోవడం వల్ల ఈ విధంగా నా పై కేసులు పెట్టడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందంటూ ఆ మహిళ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.