Tag Archives: Protests

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!

KTR: రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ… ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణకు నేను వ్యతిరేఖం కాదు.. కానీ చర్చించకుండా ఏపీ విభజన చేశారని.. దీంతోనే రెండు రాష్ట్రాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని… కాంగ్రెస్ వల్లే రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!

తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!

ప్రధాని మోదీ పదేపదే తెలంగాణను అవమానిస్తున్నారని.. దశాబ్ధాల స్పూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రధానికే అవమానకరం అంటూ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 

తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా..

మరోవైపు ఈరోజు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. రాష్ట్రంలోని మంత్రులు కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా చేయలేదని విమర్శిస్తున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని అంటున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ పార్టీ కూాడా రియాక్ట్ అయింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీాఎర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోదీ విమర్శిస్తే మీకేం నొప్పి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని అన్నారు.

బెంగాల్లో 200 మంది బీజేపీ నేతలు అరెస్ట్!

కోల్‌కతాలో చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్‌తో సహా 200 మంది బిజెపి మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కోల్‌కతాలోని సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి ముందు బీజేపీ నేతలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారింది. దీంతో అరెస్టు చేసిన వారందరినీ కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ లాకప్‌కు తీసుకువెళ్లారు.

కాగా హౌరా జిల్లాలోని బాగ్నాన్‌లో ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ కి వ్యతిరేకంగా బిజెపితో పాటు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పోలీసు సిబ్బందికి మరియు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించి, చట్టవిరుద్ధంగా సమావేశమైనందున ఆందోళనకారులను అరెస్టు చేయవలసి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.