KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!
KTR: రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ… ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణకు నేను వ్యతిరేఖం కాదు.. కానీ చర్చించకుండా ఏపీ విభజన చేశారని.. దీంతోనే రెండు రాష్ట్రాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని… కాంగ్రెస్ వల్లే రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పదేపదే తెలంగాణను అవమానిస్తున్నారని.. దశాబ్ధాల స్పూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రధానికే అవమానకరం అంటూ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈరోజు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. రాష్ట్రంలోని మంత్రులు కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా చేయలేదని విమర్శిస్తున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని అంటున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ పార్టీ కూాడా రియాక్ట్ అయింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీాఎర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోదీ విమర్శిస్తే మీకేం నొప్పి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…