Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!
Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబ త్యాగాలకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.
పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు రాహుల్ ను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. తాను లేవనెత్తిన అంశాలపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతూ, తన ప్రశ్నల నుంచి తప్పించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు.
చైనా- పాక్ ఏకమవడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, దేశంలో విభజన రాజకీయాలపై ప్రశ్నించినా సమాధానమే రాలేదన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.
మూడు గంటలకు పైగా ఆయన ప్రసంగంలో ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ కుటుంబ పాలనే(గాంధీల కుటుంబం) కారణమని తిట్టిపోశారు. దేశంలో అత్యవసర పరిస్థితికి, సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బలహీనపరిచిందన్నారు. ఈ సందర్భంగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుపట్టారు. సరైన చర్చ లేకుండా రాష్ర్టంను విడదీశారని ఆక్షేపించారు. పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వమిక పద్ధతుల్లో నాటి బిల్లును ఆమోదించారన్నారు. లోక్ సభలో పెప్పర్ స్ర్ప ఘటనలతో ఆనాడు హింస ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోకపోవడంతో నాటి సమస్యలు రెండు తెలుగు రాష్ర్టలలో ఇంకా నలుగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచారన్నారు. తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతి టి.అంజయ్య మరణాంతరం జరిగిన అవమానాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అంటే భయమని, అందుకు నిదర్శనమే ఈ ప్రసంగమని ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదోవపట్టించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో చైనా – పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతున్నాయని ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ విషయమై సమాధానమే రాలేదన్నారు. ఈ వైఖరికి దేశ భద్రతకు మంచిది కాదన్నారు. కొవిడ్ మొదటి దశలోనూ మోదీ ప్రభుత్వానికి పలు చేసామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనో, నెహ్రూ కుటుంబాన్నో విమర్శించడం కాదు మీరు(మోదీ) దేశ రక్షణకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…