Tag Archives: puja functions

Mahesh Babu -Namrata: ఘనంగా మహేష్ బాబు నమ్రత రెస్టారెంట్ ప్రారంభోత్సవం… పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు దంపతులు దూరం!

Mahesh Babu -Namrata: మహేష్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో వ్యాపారాలను కూడా ప్రారంభించి వ్యాపార రంగంలో కూడా ఎంతో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ఏషియన్స్ వారితో కలిసి మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మించగా తాజాగా ఏషియన్ వారితో కలిసి హైదరాబాదులో రెస్టారెంట్ కూడా ప్రారంభించబోతున్న విషయం మనకు తెలిసిందే.

అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ నిర్మాణం జరిగింది. ఇక ఈ రెస్టారెంట్ కు ఏఎన్ అని నామకరణం కూడా చేశారు.ఏ అంటే ఏషియన్స్ ఎన్ అంటే నమ్రత అని వచ్చేలా ఏషియన్స్ వారితో కలిసి తన భార్య పేరు మీదగా మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

ఇప్పటివరకు మహేష్ బాబు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టగా అన్ని వ్యాపారాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలోనే రెస్టారెంట్ వ్యాపారం కూడా మంచి లాభాలను అందుకుంటే ఈ రెస్టారెంట్ ను వివిధ పట్టణాలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇకపోతే నేడు ఎంతో ఘనంగా ఈ రెస్టారెంట్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించి రెస్టారెంట్ ప్రారంభించారు.

Mahesh Babu -Namrata: కృష్ణ మరణంతో పూజా కార్యక్రమాలకు దూరంగా మహేష్ దంపతులు…

ఈ పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు దంపతులు దూరంగా ఉన్నారు. తాజాగా కృష్ణ గారు మరణించడం వల్లే ఇలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు అని సన్నిహితులు తెలియజేయడంతో మహేష్ బాబు నమ్రత దంపతులు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఇలా మహేష్ బాబు సమ్రత పూజా కార్యక్రమాలు చేయకూడదని తెలియడంతో ఏషియన్స్ వారు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.