Mahesh Babu -Namrata: మహేష్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో వ్యాపారాలను కూడా ప్రారంభించి వ్యాపార రంగంలో కూడా ఎంతో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ఏషియన్స్ వారితో కలిసి మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మించగా తాజాగా ఏషియన్ వారితో కలిసి హైదరాబాదులో రెస్టారెంట్ కూడా ప్రారంభించబోతున్న విషయం మనకు తెలిసిందే.
అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ నిర్మాణం జరిగింది. ఇక ఈ రెస్టారెంట్ కు ఏఎన్ అని నామకరణం కూడా చేశారు.ఏ అంటే ఏషియన్స్ ఎన్ అంటే నమ్రత అని వచ్చేలా ఏషియన్స్ వారితో కలిసి తన భార్య పేరు మీదగా మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.
ఇప్పటివరకు మహేష్ బాబు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టగా అన్ని వ్యాపారాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలోనే రెస్టారెంట్ వ్యాపారం కూడా మంచి లాభాలను అందుకుంటే ఈ రెస్టారెంట్ ను వివిధ పట్టణాలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇకపోతే నేడు ఎంతో ఘనంగా ఈ రెస్టారెంట్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించి రెస్టారెంట్ ప్రారంభించారు.
ఈ పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు దంపతులు దూరంగా ఉన్నారు. తాజాగా కృష్ణ గారు మరణించడం వల్లే ఇలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు అని సన్నిహితులు తెలియజేయడంతో మహేష్ బాబు నమ్రత దంపతులు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఇలా మహేష్ బాబు సమ్రత పూజా కార్యక్రమాలు చేయకూడదని తెలియడంతో ఏషియన్స్ వారు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…