Movie News

Ramcharan: రీమేక్ సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్.. ఏమన్నారంటే?

Ramcharan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాని తిరిగి ఇతర భాషలలో రీమేక్ చేయడం సర్వసాధారణం. ఇలా ఈ రీమేక్ వ్యవహారం ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇతర భాషలలోకి అలాగే ఇతర భాషలలో సినిమాలను తెలుగులోకి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రీమేక్ సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆల్రెడీ ఓటీటీలో ప్రసారమవుతున్నటువంటి సినిమాలను రీమేక్ చేయడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఎందుకంటే ఒక సినిమా ఓటిటిలో ప్రసారమవుతుంటే ఆ సినిమాని అందరూ చూసి ఉంటారు.

ఇలా చూసిన సినిమాని తిరిగి చూడడం కోసం జనాలు థియేటర్లకు రారు. ఒకవేళ ఈ రీమేక్ సినిమాలలో స్టార్ హీరోలు కనుక నటిస్తే కొంతమంది అభిమానులు మాత్రం వస్తారే తప్ప పూర్తి స్థాయిలో ప్రేక్షకులు సినిమాలను చూడటానికి థియేటర్లకు రారు.ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ ఒకవేళ తాను రీమేక్ చేయాలనుకుంటే ఓటీటీలో ప్రసారం కాని సినిమాలను రీమేక్ చేస్తానని అదేవిధంగా ఈ సినిమా నిర్మాతలను రిక్వెస్ట్ చేసి సినిమాని ఓటీటీలో ప్రసారం చేయద్దు అంటూ చెబుతానని ఈ సందర్భంగా రామ్ చరణ్ వెల్లడించారు.

Ramcharan:హీరోల స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు…

ఇక రాంచరణ్ రీమేక్ సినిమాల గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇలాంటి రీమేక్ సినిమాలకు రాంచరణ్ కూడా మినహాయింపు కాదు. రీమేక్ సినిమాలను హైలెట్ చేసే నేపథ్యంలో హీరోల స్థాయి పడిపోతుందని, రీమేక్ సినిమాల కోసం వారి క్రేజ్, స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం లేదని పలువురు రాంచరణ్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago