Ali -Pawan Kalyan:సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు మిత్రులుగా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా శత్రువులుగా మారుతుంటారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ ఒకరు.పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఎలాంటి స్నేహబంధం ఉంది అంటే పవన్ ఏదైనా సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా ఆ సినిమాలో ఆలీ ఉండాల్సిందే. అంతలా వీరిద్దరి మధ్య స్నేహం ఉండేది.
ఇక పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన రాజకీయాలలో కొనసాగుతున్నప్పటికీ అలీ ఇండస్ట్రీలో ఉంటూనే వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగింది. ఇకపోతే ఆలీ కూడా జనసేన పార్టీలోకి వస్తారని అందరూ భావించారు.
ఇక ఈయన ఊహించని విధంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా గత ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఇదంతా కేవలం రాజకీయాల వరకు మాత్రమేనని వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా అలీ పెద్ద కుమార్తె వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి.అలీ కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం కేవలం రాజకీయ మనస్పర్ధలే కారణమని కొందరు భావిస్తుండగా మరికొందరు ఈయన రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు అంటూ చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహానికి ఎందుకు రాలేదు అసలు ఆలీ తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారా అనే విషయాలు తెలియాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…